మొబైల్ ఫోటోగ్రఫీ కోసం ఈ ప్రత్యేక పద్ధతులను పాటించండి.. దీంతో మీ ఫోటోలు చాలా ప్రొఫెషనల్ గా కూడా కనిపిస్తాయి..

First Published Feb 28, 2021, 12:15 PM IST

ప్రకృతి, సూర్యాస్తమయం లేదా పిల్లల ఫోటోలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.   ఈ రోజుల్లో డిజిటల్ కెమెరాలలో ఉండే చాలా ఫీచర్లు స్మార్ట్‌ఫోన్‌లలో  అందిస్తున్నారు. ఫోటోలను తీయడం అనేది ఒక కళ. మీకు ఫోటోగ్రఫీ అనుభవం లేనప్పటికీ కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించడం ద్వారా మీరు  మీ అభిరుచికి తగ్గట్టుగా ఫోటోలను తీయవచ్చు. మొబైల్ ఫోటోగ్రఫీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు మీకోసం..

మీరు ఫోటోలు తీసే ముందు మీ ఆబ్జెక్ట్ లేదా దీనినైతే మీరు ఫోటో తీయాలనుకుంటున్నారో దానిని సరైన స్థలంలో లేదా స్క్రీన్ మధ్యలో ఉంచడానికి ప్రయత్నించండి. మీ స్క్రీన్‌లో గ్రిడ్ లైన్స్ ఊహించుకోండి. ఇది స్క్రీన్ పై 9 చతురస్రాలను సృష్టిస్తుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలలో ఇప్పటికీ గ్రిడ్ ఆప్షన్ ఉంటుంది, తద్వారా మీరు మీ ఫోటోకు బ్యాలెన్స్ , కొత్తదనాన్ని ఇవ్వగలరు.
undefined
మీరు తీయాలనుకునే దాని పై దృష్టి పెట్టండి తరువాత ఫోన్ లో ఫోకస్ చేసిన తర్వాత కెమెరాలో క్యాప్చర్ బటన్ పై నొక్కండి. చాలా స్మార్ట్‌ఫోన్‌లకు ఫోకస్‌తో పాటు ఎక్స్‌పోజర్ (ఫోటోకి ఎంత లైట్ అవసరం అనేది చూపిస్తుంది) కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు లైట్ ఎక్కువ లేదా తగ్గించవచ్చు.
undefined
సరైన సమయం ఎంచుకోవడంసూర్యోదయం తరువాత, సూర్యాస్తమయం ముందుని గోల్డెన్ అవర్ (గోల్డెన్ టైమ్) అంటారు. ఈ సమయంలో సూర్యుని కాంతి ఎర్రగా ఉంటుంది, కానీ ప్రకాశవంతంగా ఉండదు. ఫోటోగ్రఫీకి ఇది చాలా అనువైన సమయం. సహజ కాంతిలో ఫోటోలను తీయండి, అవసరమైనప్పుడు మాత్రమే ఫ్లాష్ ఉపయోగించండి. అప్పుడే ఫోటోలు న్యాచురల్ గా కనిపిస్తాయి.
undefined
ఫోటోలో కొత్తదనం కోసం నీటిలోని ప్రతిబింబం ఫోటోలను తీయండి. విభిన్న కోణాల నుండి ఫోటోలను తీయడం ద్వారా కలర్, ఎక్స్పొజర్ లో తేడాను చూపిస్తుంది. కనీసం రెండుసార్లు ఫోటోలను తీయండి ఎందుకంటే కొన్నిసార్లు చేయి కదిలినప్పుడు ఫోటో అస్పష్టంగా ఉంటుంది లేదా ఆబ్జెక్ట్ కదిలినప్పుడు కూడా అది మరింత తీవ్రమవుతుంది. ఫిల్టర్ల వాడకాన్ని తగ్గించండి. ఎందుకంటే ఫోటోలను సహజంగా తీసిన తరువాత వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
undefined
ఫోటో ఫ్రేమ్ పై శ్రద్ధ వహించండి. మీరు తీసే ఫోటోలపై దృష్టి పెట్టడానికి ఫ్రేమ్ సహాయపడుతుంది. ఫోటోలో ఖాళీ స్థలాన్ని ఉంచండి. ఫోటో ఫ్రేమ్‌ యొక్క నాలుగు మూలలపై కూడా శ్రద్ధ వహించండి. ఈ చిట్కాలు పాటించడంతో మీరు బెస్ట్ ఫోటోలను తీయవచ్చు.
undefined
click me!