Best Drone Cameras : ఏమిటీ..! కేవలం రూ.5,000 కే 4K డ్రోన్ కెమెరాలా..!!

Published : Dec 27, 2025, 12:35 PM IST

Drone Cameras : కొత్తగా నేర్చుకునేవారికి, పిల్లలు ఆడుకునేందుకు 4K వీడియో సౌకర్యం ఉన్న డ్రోన్లు తక్కువ ధరకే కావాలా… అయితే రూ.5000 లోపు లభించే ఉత్తమ డ్రోన్ కెమెరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఈ డ్రోన్స్ చవక గురూ...

Drone Camera : ఆకాశంలో ఎగిరే డ్రోన్లతో అందమైన ఫోటోలు, వీడియోలు తీయాలని చాలామంది కోరిక. కానీ డ్రోన్ కెమెరాలు చాలా ఖరీదైనవి అని భావించి కొనడానికి వెనకడుగు వేస్తుంటారు. కానీ ఇకపై ఆ చింత వద్దు… కేవలం 5000 రూపాయలలోపు లభించే ఉత్తమ బడ్జెట్ డ్రోన్‌లు కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి.

26
బిగినర్స్ కి ఈ డ్రోన్ ఉత్తమం...

కొత్తగా డ్రోన్ నడిపేవారికి E99 ప్రో ఒక గొప్ప వరం. ఇది మడతపెట్టగలిగే (ఫోల్డబుల్) డిజైన్‌తో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనిలోని 4K FPV కెమెరాతో మంచి వీడియోలు తీయొచ్చు. స్థిరంగా ఎగరడం, సులభమైన కంట్రోల్స్ కొత్తవారికి చాలా ఉపయోగపడతాయి.

36
ఈ డ్రోన్ కెమెరాలో అద్భుత ఫీచర్లు

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలా? అయితే Z3 మ్యాక్స్ మీకు సరైనది. ఇది మూడు కెమెరాలతో వస్తుంది, 1080p వీడియో క్వాలిటీని అందిస్తుంది. వై-ఫై లైవ్ ఫీడ్ సౌకర్యం ఉండటంతో, ఎగిరేటప్పుడే దృశ్యాలను మీ మొబైల్‌లో నేరుగా చూడొచ్చు.

46
పిల్లల కోసం ఈ డ్రోన్స్ బెటర్

పిల్లలకు డ్రోన్ ఎలా ఎగరేయాలో నేర్చించాలనుకుంటున్నారా..? ఇలాంటివారికి V-CAP డ్రోన్ ఒక మంచి వినోద సాధనం. ఇందులో రెండు కెమెరాలు ఉన్నాయి. సంజ్ఞల ద్వారా సెల్ఫీలు తీసుకునే (Gesture control selfies) సౌకర్యం దీని ప్రత్యేకత. ఇంట్లోనే సురక్షితంగా ఎగరేయడానికి ఇది చాలా అనుకూలమైనది.

పేరుకు తగ్గట్టే ఇది చాలా చిన్నది, కాంపాక్ట్‌గా ఉంటుంది. మొదటిసారి డ్రోన్ కొనేవారికి ఇది ఒక మంచి ఎంపిక. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సులభం. చిన్నదే అయినా ఇది అందించే 4K క్వాలిటీ దృశ్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఎక్కడికైనా తీసుకెళ్లి ఎగరేయడానికి వీలుగా ఉంటుంది.

56
RBR క్వాడ్‌కాప్టర్ డ్రోన్

డ్రోన్ నడిపేటప్పుడు అది స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. RBR క్వాడ్‌కాప్టర్ ఈ విషయంలో ఉత్తమమైనది. దీని 'ఆల్టిట్యూడ్ హోల్డ్' (Altitude hold) టెక్నాలజీ, డ్రోన్‌ను ఒకే ఎత్తులో స్థిరంగా ఎగరడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఫోటోలు, వీడియోలు కదలకుండా స్పష్టంగా వస్తాయి.

66
రూ.5000 లోపు ధరతో బెస్ట్ డ్రోన్స్

రూ. 5000 లోపు లభించే ఈ డ్రోన్లు ఎక్కువగా వినోదం, నేర్చుకోవడం కోసమే. వీటి బ్యాటరీ లైఫ్, విడిభాగాల లభ్యతను చూసి కొనడం మంచిది. మీ అవసరానికి, బడ్జెట్‌కు సరిపోయే డ్రోన్‌ను ఎంచుకుని ఆకాశంలో విహరించండి… అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీసుకొండి. 

Read more Photos on
click me!

Recommended Stories