బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అధికారిక వెర్షన్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉందని క్రాఫ్టన్ డెవలపర్లు ప్రకటించారు.
బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని అక్సెస్ పొందిన వారు గూగుల్ ప్లే స్టోర్ నుండి అధికారిక అప్ డేట్ కోసం యాప్ అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గేమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. థర్డ్ పార్టీ స్టోర్స్ నుండి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ఏపికేని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రాఫ్టన్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ఐఓఎస్ యాప్ ప్రకటించే వరకు ఐఫోన్ వినియోగదారులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీనిపై అధికారిక ప్రకటనను అతి త్వరలో రావొచ్చు.
పాత వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకున్నా అండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి అఫిషియల్ అప్ డేట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు కానిస్టేబుల్ సెట్ (పెర్మనెంట్) ను కలెక్ట్ చేసుకోవచ్చు, దీనిని ఇన్ గేమ్-ఈవెంట్స్ విభాగం నుండి 10 మిలియన్ డౌన్‌లోడ్‌లకు బహుమతిగా లభిస్తుంది. 'ఇండియా కా బ్యాటిల్ గ్రౌండ్' గిఫ్ట్ 1 మిలియన్ అండ్ 5 మిలియన్ డౌన్‌లోడ్ల రివార్డ్‌ను సేకరించడానికి ఆగస్టు 19 వరకు క్రాఫ్టన్ పొడిగించింది. కొన్ని కొన్ని చిన్న మార్పులతో ఈ గేమ్ పబ్-జి మొబైల్‌తో పోలి ఉంటుంది.
మీరు మీ డేటాను పబ్-జి మొబైల్ నుండి కొత్త గేమ్ బదిలీ చేసుకొని గేమ్ కొనసాగించవచ్చని క్రాఫ్టన్ ప్రకటించింది. సింగపూర్‌లోని క్రాఫ్టన్ సర్వర్‌లలో డేటా సురక్షితంగా నిల్వ చేయబడుతుందని తెలిపింది.