ఈ వీడియో చేయడానికి పెద్దగా టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. ఒక హై-క్వాలిటీ బేబీ ఇమేజ్, Kling AI అకౌంట్, Higgsfield AI వీడియో జనరేటర్, ఒక మంచి ప్రాంప్ట్ ఉంటే చాలు.
స్టెప్ 1: బేబీ ఇమేజ్ రెడీ చేసుకోండి
ముందుగా మీకు స్పష్టమైన, హై-క్వాలిటీ బేబీ ఫోటో కావాలి. మీ దగ్గర నిజమైన బేబీ ఫోటో ఉంటే, అది ఫ్రంట్ ఫేస్‌తో, మంచి లైటింగ్‌లో ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు AI ఇమేజ్ వాడాలనుకుంటే, Higgsfield లేదా మరో AI ఇమేజ్ జనరేటర్‌లో ఈ ప్రాంప్ట్ ట్రై చేయొచ్చు. “Ultra realistic cute baby, soft lighting, cinematic look, shallow depth of field, 4K quality”
స్టెప్ 2: Kling AI తో మోషన్ కంట్రోల్ వీడియో చేయండి
ఇప్పుడు ఈ ఇమేజ్‌ను వీడియోగా మార్చడానికి Kling AI వాడాలి. Kling AI వెబ్‌సైట్‌కి వెళ్లి 'Image to Video' ఆప్షన్ ఎంచుకోండి. మీ బేబీ ఇమేజ్ అప్‌లోడ్ చేసి, ఒక మోషన్ ప్రాంప్ట్ రాయండి.
ఉదాహరణకు: “Slow cinematic camera movement, soft zoom in, natural baby facial expressions, realistic motion”
వీడియో నిడివి 5 నుంచి 10 సెకన్లు పెట్టి, 'Generate' పై క్లిక్ చేయండి. కొద్ది క్షణాల్లోనే మీ బేబీ AI వీడియో రెడీ అవుతుంది.
స్టెప్ 3: Higgsfield AI తో వీడియోను మెరుగుపరచండి
ఇప్పుడు ఈ వీడియోకు మరింత ప్రొఫెషనల్ టచ్ ఇవ్వడానికి Higgsfield AI వీడియో జనరేటర్ వాడండి. ఈ టూల్ వీడియోను స్మూత్ చేస్తుంది, ఫేస్ డిటైల్స్‌ను మెరుగుపరుస్తుంది, లైటింగ్‌లో సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మీరు మీ వీడియో ఫైనల్ రెండర్ తీసుకోవచ్చు.