Smartphone Tricks : మీ ఫోన్‌లో వైరస్ ఉందా..? ఈ లక్షణాలతో వెంటనే కనిపెట్టేయండి

Published : Feb 10, 2026, 04:42 PM IST

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మాల్‌వేర్ లేదా వైరస్ ఉందా? బ్యాటరీ త్వరగా అయిపోవడం, డేటా ఎక్కువగా వాడటం వంటి లక్షణాలను బట్టి దాన్ని ఎలా గుర్తించాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
16
మీ ఫోన్ వైరస్ బాారిన పడిందా..? తెలుసుకునే చిట్కాలివే

మనమంతా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లపైనే ఆధారపడి బతుకుతున్నాం. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి సోషల్ మీడియా వరకు అన్నీ ఫోన్‌లోనే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాల్‌వేర్ దాడులు పెరుగుతున్నాయని హెచ్చరికలు వస్తున్నాయి. పనికిరాని యాప్స్, ఫేక్ లింక్స్ ద్వారా ఈ మాల్‌వేర్ మీ ఫోన్‌లోకి చొరబడుతుంది. మీ ఫోన్ సేఫ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇవిగో కొన్ని సింపుల్ టిప్స్.

26
ఫోన్ ఉన్నట్లుండి స్లో అయ్యిందా..?

మీ ఫోన్ ఉన్నట్టుండి స్లో అయిపోయిందా (Slow Performance)? లేదా తరచూ హ్యాంగ్ అవుతోందా? కారణం లేకుండా వేడెక్కిపోతోందా (Overheating)? ఇవన్నీ మాల్‌వేర్ ఎటాక్‌కు సంకేతాలు కావచ్చు. మీరు వాడకపోయినా బ్యాటరీ ఫాస్ట్‌గా అయిపోతుంటే, అది కూడా ఓ ముఖ్యమైన లక్షణమే.

36
మీరు ఇన్‌స్టాల్ చేయకున్నా యాప్స్ వచ్చాాయా..?

మీ ఫోన్ 'సెట్టింగ్స్'లోకి వెళ్లి 'యాప్స్' క్లిక్ చేయండి. ఆ లిస్ట్‌లో మీరు ఇన్‌స్టాల్ చేయని, లేదా ఏవైనా కొత్త పేర్లతో యాప్స్ ఉన్నాయేమో చూడండి. కొన్ని మాల్‌వేర్ యాప్స్ ఫ్లాష్‌లైట్, కాలిక్యులేటర్ లాంటి పేర్లతో మారువేషంలో ఉంటాయి. అనుమానం వస్తే వెంటనే వాటిని అన్-ఇన్‌స్టాల్ (Uninstall) చేసేయండి.

46
అవసరం లేని పర్మిషన్లను తొలగించండి

కొన్ని మామూలు యాప్స్ కూడా మీ కాంటాక్ట్స్, కెమెరా లేదా మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతాయి. ఉదాహరణకు ఒక కాలిక్యులేటర్ యాప్‌కు మీ కాంటాక్ట్స్ వివరాలతో పనేముంటుంది? 'Settings > Privacy > Permission Manager'లోకి వెళ్లి ఏ యాప్ ఏ పర్మిషన్ వాడుతుందో చెక్ చేయండి. అవసరం లేని పర్మిషన్లను వెంటనే తీసేయండి.

56
ఎక్కువ డేటా వాడినా ప్రమాదమే..

మాల్‌వేర్ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ మీ మొబైల్ డేటాను దొంగిలించగలవు. 'Settings > Network & Internet > Data usage'లోకి వెళ్లి, ఏ యాప్ ఎక్కువ డేటా వాడుతుందో గమనించండి. మీరు పెద్దగా వాడని యాప్ ఏదైనా ఎక్కువ డేటా వాడితే, అది ప్రమాదకరం.

66
తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు

ఎప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్‌లలో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయొద్దు. మీ ఫోన్‌లో 'Google Play Protect' ఆన్‌లో ఉందో లేదో చూసుకోండి. సమస్య తీవ్రంగా ఉంటే ఫోన్‌ను 'ఫ్యాక్టరీ రీసెట్' (Factory Reset) చేయడం ఒక్కటే పూర్తి పరిష్కారం.

Read more Photos on
click me!

Recommended Stories