AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

Published : Feb 10, 2026, 09:45 AM IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే తమ ఉద్యోగాాలకు మప్పు పొంచివుందని చాలామంది భావిస్తున్నారు… ఇప్పుడు ఆంత్రోపిక్ ఏఐ వచ్చేసింది. ఇది ఉద్యోగులకు పీడకలనే మిగిల్చేలా ఉంది. అసలు ఏమిటీ Anthropic AI ? 

PREV
15
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరో విప్లవం...

Anthropic AI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగుల్లో భయాందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ఎక్కడ తమ ఉద్యోగాలను మింగేస్తుందోననే ఆందోళన ఉంది... ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఇది ఎక్కువగా ఉంది. అయితే ఏఐ అనేది మనుషుల్లా అలోచించలేదు, టి ఓ ఉద్యోగిలా సమర్థంగా పనిచేయలేదు కాబట్టి జాబ్స్ సేఫ్ అని చాలామంది ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆంత్రోపిక్ ఏఐ రాకతో వీరిలోనూ భయం మొదలయ్యింది.

25
అసలు ఏమిటీ ఆంత్రోపిక్ ఏఐ?

ఏఐ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే... దీనికి మనిషిలా విచక్షణ ఉండదు. ఇది మనిషి నియంత్రణలో ఉంటుంది.. ఏం చెబితే అది మాత్రమే చేస్తుంది. కానీ ఆంత్రోపిక్ ఏఐ అనేది మనిషిలా ఆలోచించగలదు. అంటే ఇది ఏది మంచి, ఏది చెడు అనే తెలుసుకుని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది... మనిషికంటే చాలా కచ్చితంగా పనిచేస్తుంది. దీని రాకతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది... ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొంది.

35
ఆంత్రోపిక్ ఏఐ ఎఫెక్ట్....

ఆంత్రోపిక్ ఏఐ ఉద్యోగాలను మింగేస్తోంది... సాప్ట్ వేర్ కంపెనీలు మూతపడేలా చేస్తోంది. సాధారణంగా సాప్ట్ వేర్ కంపెనీలు చేసే పనులన్నీ ఇది చేసేస్తోంది... దీంతో పెద్దపెద్ద కంపెనీలు కూడా బిజినెస్ లేక ఇబ్బందిపడుతున్నాయి. ఈ ఆంత్రోపిక్ ఏఐ రాకతో అమెరికా లాంటి దేశాల్లో కూడా సాప్ట్ వేర్ కంపెనీలు మూతపడుతున్నాయి... ఈ రంగంలో లేఆఫ్స్ పెరిగిపోయాయి.

కోడింగ్, సాఫ్ట్ వేర్స్ డెవలప్ మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనాన్సియల్ రీసెర్చ్, ఫైనాన్స్ ఆండ్ లీగల్ అనాలసిస్ వంటి క్లిష్టమైన పనులు ఆంత్రోపిక్ ఏఐ ఈజీగా చేసేస్తోంది. ఇందులో మనిషి జోక్యం అవసరం లేదు... అంతా ఏఐ చేసేసుకుంటుంది. దీంతో సాప్ట్ వేర్ ఉద్యోగుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.

45
ఆంత్రోపిక్ ఏఐ ఎలా పనిచేస్తుంది..?

సాధారణంగా ఏఐ మోడళ్లను మనుషులు ట్రెయిన్ చేస్తారు. కానీ ఈ ఆంత్రోపిక్ ఏఐ విధానం ఇలా కాదు... ఏఐకి ముందే కొన్ని నైతిక నియమాలు ఇస్తారు. హింస, ద్వేషం, తప్పుడు సమాచారం లాంటి విషయాల నుంచి దూరంగా ఉండేలా ట్రెయిన్ చేస్తారు. మనిషి జోక్యం తక్కువగా ఉంటుంది...అంటే ఏఐనే ఏఐ నియంత్రించుకునే విధానం. అందుకే ఈ ఆంత్రోపిక్ ఏఐని “సేఫ్ ఏఐ” గా పిలుస్తున్నారు.

55
ఈ ఉద్యోగాలపైనా Anthropic AI ప్రభావం...

ఈ ఆంత్రోపిక్ ఏఐ లాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వల్ల కొన్ని ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైనది సాప్ట్ వేర్ రంగం... అలాగే డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, బేసిక్ కంటెంట్ రైటింగ్, ట్రాన్స్‌లేషన్ పనులు, కాల్ సెంటర్ జాబ్స్ పై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పనులను ఏఐ చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో, చాలా కచ్చితత్వంతో చేయగలుగుతోంది.

అయితే ఈ ఆంత్రోపిక్ ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా నశిస్తాయనేది నిజం కాదు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ట్రెయినర్, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, ఏఐ కంటెంట్ ఎడిటర్, డేటా అనలిస్ట్, ఏఐ పాలసీ ఆండ్ సేప్ట్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. అంటే పాత ఉద్యోగాల స్థానంలో కొత్త స్కిల్స్ అవసరమైన ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఏఐ శత్రువు కాదు... దీనికి భయపడే బదులు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఏఐతో కలిసి పని చేయడం అలవాటు చేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories