శవాలకు ప్రాణం పోసే జర్మన్ కంపెనీ! మృత్యువును ఓడించాలంటే ఇదొక్కటే మార్గం!

First Published Aug 9, 2024, 4:11 PM IST

మరణం అనివార్యం. కానీ, ప్రపంచ వ్యాప్తంగా చాలామంది మృత్యువును జయించి జీవించడానికి మార్గాలను అన్వేషించడంలో బిజీగా ఉన్నారు. అయితే పాపులర్ సిలికాన్ వ్యాలీ కంపెనీ CEO బ్రియాన్ జాన్సన్... యాంటీ ఏజింగ్ నియమావళితో అతని జీవ సంబంధమైన వయస్సు ఐదేళ్లకు పైగా పెరిగిందని పేర్కొన్నారు.
 

cryopreservation

జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ టుమారో బయో ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో మొత్తం శరీరాన్ని ఫ్రీజ్ చేయొచ్చని.. అలాగే తిరిగి జీవం పోయవచ్చని కంపెనీ పేర్కొంది.

మరణానంతరం మొత్తం శరీరాన్ని రక్షించేందుకు కేవలం మెదడును కాపాడుకోవాలంటే రూ.1.8 కోట్లు ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది.

క్రయో ప్రిజర్వేషన్‌లో మృతదేహాన్ని మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ వద్ద 'బయోస్టాసిస్'లో ఉంచుతారు. ఇది అన్ని జీవసంబంధ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తుంది. మరణించిన వ్యక్తి శరీరం మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరుకోవడానికి వరుసగా 10 రోజుల పాటు లిక్విడ్ నైట్రోజెన్‌తో నిండిన ఇన్సులేటెడ్ స్టీల్ కంటైనర్‌లో ఉంచుతారు.
 

భవిష్యత్తులో పునర్జీవన (resuscitation) టెక్నాలజీ  కనిపెట్టినప్పుడు, ఈ విధంగా భద్రపర్చిన మృతదేహాలను పునర్జీవం పోయవచ్చని, మరణానికి కారణాన్ని గుర్తించి చికిత్స చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

టుమారో బయో వెబ్‌సైట్‌లో ‘ప్రజలు ఎంతకాలం జీవించాలో నిర్ణయించుకునే ప్రపంచాన్ని సృష్టించడమే కంపెనీ లక్ష్యం’ అని చెబుతోంది. 

ఇప్పటికే ఆరుగురు క్రయో ప్రిజర్వేషన్ విధానంలో తమ శరీరాలను సురక్షితంగా ఉంచేందుకు డబ్బు   చెల్లించారు. అంతే  కాకుండా, 650 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు.

Latest Videos


‘మన కాలంలో జీవులను సురక్షితంగా క్రయో ప్రెజర్ చేసి తిరిగి జీవం పోయడాన్ని మనం చూడవచ్చు’ అని టుమారో బయో సహ వ్యవస్థాపకుడు ఫెర్నాండో అజెవెడో పిన్‌హీర్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించిన వెంటనే తమ కంపెనీ పని ప్రారంభిస్తుందన్నారు. వివిధ యూరోపియన్ నగరాల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన అంబులెన్స్‌లు మృతదేహాలను స్విట్జర్లాండ్‌కు రవాణా చేస్తాయని వివరించారు. బెర్లిన్, ఆమ్‌స్టర్‌డామ్, జూరిచ్‌లలో కంపెనీకి ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయి.

క్రయో ప్రిజర్వేషన్ (cryopreservation) అంటే ఏమిటి?

క్రయో ప్రిజర్వేషన్ అనేది దీర్ఘకాలిక సంరక్షణ కోసం జీవ కణాలు, కణజాలాలు, అవయవాలు మొదలైన వాటిని గడ్డకట్టించే ప్రక్రియ.

కానీ, క్రయో ప్రిజర్వేషన్  భిన్నంగా ఉంటుంది. శరీరం గడ్డ కట్టకుండా నిరోధించడానికి ప్రత్యేక క్రయో ప్రొటెక్టెంట్ (లిక్విడ్ నైట్రోజన్) ఉపయోగించబడుతుంది.

click me!