
1. కుట్రలు పన్నడం ..
2 . కక్ష సాధింపు ..
3. సోషల్ నెట్ వర్క్ ఏర్పరుచుకొని ఇతరులకు అర్థం కాని భాషలో తమలో తాము మాట్లాడుకోవడం..
ఈ పనులు ఎవరు చేయగలరు?
ఇంకెవరు ?
తీవ్రవాదులే ... అనుకొంటాము కదా ?
ఇప్పుడు కృతిమ మేథ యంత్రాలు ఈ పనులు కూడా మొదలు పెట్టాయి అంటే నమ్మలేము.
కదా?
కానీ ఇది నిజం .
ప్రస్తుతానికి అతి తక్కువ స్థాయిలో!
మరి కొన్నాళ్లకు?
"మనిషి అదుపు తప్పి పోతుంది" అంటున్నారు.
మనిషికంటే ఎక్కువ తెలివి గల, మనుషులు కంట్రోల్ చేయలేని యంత్రాలను అవి తయారు చేసే అవకాశం.
అవకాశం కాదు .. ప్రయత్నాలు మొదలెట్టాయట..!
సైన్స్ ఫిక్షన్ లాగా ఉంది కదా?
ఒకప్పుడు సినిమా చూడాలి అంటే థియేటర్ కు వెళ్ళాల్సి ఉండేది.
సినిమా కు సంభందించి సెన్సార్ ఉండేది .
ఏదయినా అతి ఉంటే సినిమా విడుదలకు అవకాశమే ఉండేది కాదు.
లేదా భారీగా కట్లు .
ఇప్పుడు సినిమా , రీల్స్ .. ఫిలిమ్స్ ఆర్ చేతిలోకి వచ్చేశాయి. పిల్లలతో సహా ఎవరైనా చూడొచ్చు.
కానీ చిత్రంగా దీని పై ఎలాంటి నియంత్రణ లేదు .
ఎవరయినా ఏదైనా మాట్లాడొచ్చు.
యూట్యూబ్ ఛానల్ పేరుతొ మొబైల్ కెమెరా తీసుకొని ఎవరిని ఏదైనా అడగొచ్చు.
ఒక సాయంకాలం. భార్య భర్త తమ ఇద్దరు పిల్లలతో పార్క్ లో ఒక మూల కూర్చున్నారు. మూడేళ్ళ వయసున్న చిన్న పిల్ల ఇంటికి పోతాము అని ఏడుస్తోంది.
"ఆగమ్మా .. కాసేపు అయ్యాక పోదాము" అని తల్లి సముదాయిస్తోంది. ఇంతలోనే విలేకరులు { అక్రెడిటేడ్ జర్నలిస్టుల లు కాదు } అంటూ ఇద్దరు యూట్యూబ్ ఛానల్ వారు దిగిపోయారు.
మీరు పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ అని తెలుస్తోంది అని వాదనకు దిగారు.
అమాయకులయిన ఆ దంపతులు బెదిరి పోయారు.
"అయ్యో... లేదు" అన్నారు ..
తీయండి మీ ఆధార్ కార్డు తీయండి, పిల్లల బర్త్ సర్టిఫికెట్ తీయండి" అంటూ హుంకరింపులు.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటారా ?
ఇంకా జరగలేదు కానీ ..ప్రభుత్వాలు వదిలేస్తే ఇంకా అనేకం జరుగుతాయి.
ఒక బిల్డింగ్ కట్టాలంటే... బడి పెట్టాలంటే లక్ష అనుమతులు.. మంచిదే. కానీ..
ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ?
పెట్టాక విలేకరిలాగా కెమెరా వేసుకొని బయట జనాల్ని ప్రశ్నిస్తూ ఈవెంట్ కవర్ చెయ్యాలి అంటే?
ఆ పేరుతొ బ్లాక్ మెయిల్ చేస్తే?
ఎవరైనా చెయ్యొచ్చు .
అడిగేవాడు లేడు.
ప్రభుత్వం నుండి ఇసుమంత స్పందన ఉండదు.
పబ్లిక్ గా ఏమైనా మాట్లోడొచ్చు.
అడిగే వారు లేరు.
ఇక కృతిమ మేథను ప్రభుత్వాలు నియంత్రించడమా?
మొన్న ఎవరో ఇద్దరు .. ఒకాయన ఆహార పదార్తల కల్తీ పైన... మరొకామె ఆసుపత్రుల దోపిడీ పైన పార్లమెంట్ లో మాట్లాడితే చాలామంది సంతోషించారు.
AI సదస్సుల్లో చైనా నుంచి తెప్పించిన రోబో కుక్కను తమ సొంత ఆవిష్కరణ అని స్టాల్ పెట్టి మరీ ప్రచారం చేసిన ప్రైవేట్ యూనివర్సిటీ.
ఎవడో వ్యక్తి కాదు. ఏకంగా ఒక యూనివర్సిటీ ఇలా చెయ్యడం!!
ఇంకా చెప్పాలి అంటే కొన్ని వేల బడుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ పేరుతో గత కొన్నేళ్లుగా ... ఇప్పుడు రోబో కృతిమ మేథపేరుతొ మోసాలు . అడిగేవాడు ఉండడు.
కృతిమ మేథ గురించి మాట్లాడే స్థాయి .. అవసరం... ఎంత మందికి ఉంది?
ఇక్కడే కాదు. కాస్త అటుఇటుగా ప్రపంచమంతా ఇదే తీరు.
"2050 కంతా ఉద్యోగాలే ఉండవు" అని ఒకాయన.
ఉద్యోగం లేకపోతే ఎలా బతుకుతారు ?
కృతిమ మేథ చేత .. కృతిమ మేథ కొరకు .. అన్నట్టు .. అన్ని పనులు వాటి చేతే చేయిస్తే .. జనాలకు ఆదాయం సున్నా అయిపోతే అప్పుడు సరుకులు కొనేవారు ఎవరు?
ప్రభుత్వాలు ఉచితంగా పంచుతాయా?
బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి రోబోలను తయారు చేసిన ప్రపంచ కోటీశ్వరులు అన్ని జనాలకు ఉచితంగా ఇచ్చేసారు అంటే మనం నమ్మాలి .
అంతే కదా?
రోబో పెట్టుబడిదారులు తెచ్చే కమ్యూనిస్ట్ వ్యవస్థ .. అంతేనా ?
మామూలు జనాలకు ఇవన్నీ పట్టవు .
ఒక పట్టాన అర్థం కావు.
మీడియా లో వచ్చే సింహభాగం వార్తలకు అర్థాలు వేరుగా ఉంటాయి .
బంగారం ధర వెయ్యి తగ్గితే కుప్పకూలిన బంగారం అని హెడ్డింగులు .. అరుపులు .
నేను రోజూ 8.30 పడుకొంటాను .
నిన్న రాత్రి ఒక వీడియో { ఆడియో } పెట్టాను . దాన్ని చూసి ఒక పోలీస్ ఆఫీసర్ ... "కాల్ చెయ్యొచ్చా సార్?" అని మెసేజ్ . రాత్రి 9. 30 నుంచి 9.45 వరకు మాట్లాడా
ఆయన చెప్పిన విషయాలు... పక్కనే కూర్చున్న మా శ్రీమతి విని షాక్ అయ్యింది.
నేను కూడా !
చెబితే జనాలు నమ్మరు.
జనాల్ని ఇలాంటి విషయాల్లో నమ్మించాల్సిన అవసరం కూడా లేదు.
చాలా విషయాల్లో నిజాలు సమాధి అయిపోతాయి .
మీడియా లో చూసి మనకు అవగాహన అయ్యిందే నిజం అని మనం నమ్మేస్తాము .. అలాగే బతికేస్తాము .
చిన్న చిన్న విషయాల్లో ఇలా ఉంటే ప్రపంచ కుబేరులు .. వారి కృతిమ మేథ... వాటిపై జన సామాన్యానికి అవగాహన వస్తుందని .. ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలు అనే కోణం లో వీటిని నియంత్రిస్తాయి అనుకోవడం అత్యాశే !
మనిషి టెక్నాలజీ ని వాడాలి .
కానీ టెక్నాలజీ మనల్ని వాడితే ?
అధోగతి !
ఇప్పుడు మొబైల్ వాడుతున్నవారు ఎంత మంది ?
ఎంతమందిని అది వాడేస్తోంది ?
తేడా ఇదే.