ప‌క్క‌వారు ఫోన్‌లో ఏం చూస్తున్నారు? వారికి ఏం మెసేజ్‌లు వ‌స్తున్నాయి? అన్ని మీ ఫోన్‌లోనే చూడొచ్చు

Published : Feb 20, 2026, 10:12 AM IST

Smartphone: స్కూలుకు వెళ్లే పిల్ల‌లు కూడా ఫోన్ల‌ను వాడుతున్నారు. ఇలాంటి త‌రుణంలో పిల్ల‌ల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఓ యాప్‌ను తీసుకొచ్చారు. ఇంత‌కీ ఏంటా యాప్ అందులో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

PREV
15
FlashGet Kids యాప్

FlashGet Kids అనేది ఒక‌ పేరెంటల్ కంట్రోల్ యాప్. దీనిని పిల్లల ఫోన్ వినియోగాన్ని తల్లిదండ్రులు సురక్షితంగా గమనించేందుకు రూపొందించారు. పిల్లల రియల్ టైమ్ లోకేషన్ తెలుసుకోవడం, వారు ఏ యాప్స్ ఉపయోగిస్తున్నారో చూడడం, ప్రమాదకర కంటెంట్‌ నుంచి రక్షించడం ఇందులో ప్రధాన లక్ష్యాలు. ఈ యాప్ స్పై యాప్‌లా గోప్యంగా గమనించడం కాదు. తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవడానికి, మంచి డిజిటల్ అలవాట్లు పెంచేందుకు సహాయం చేసే టూల్‌లా పనిచేస్తుంది.

25
పిల్లల భద్రత కోసం లైవ్ మానిటరింగ్ ఫీచర్లు

FlashGet Kids లో ఉన్న కొన్ని ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఇవి:

రిమోట్ కెమెరా/వ‌న్ వే ఆడియో:

పిల్లల చుట్టూ ఏం జరుగుతోందో అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు వెంటనే తెలుసుకోగలరు. అవసరమైతే పిల్లలతో వెంటనే సంప్రదించవచ్చు.

స్క్రీన్ మానిట‌రింగ్‌:

పిల్లల ఫోన్ స్క్రీన్‌ను తల్లిదండ్రుల ఫోన్‌లో లైవ్‌గా చూడవచ్చు. వారు స్కూల్‌లో లేదా బయట ఏ యాప్స్ వాడుతున్నారో, ఎంతసేపు వాడుతున్నారో తెలుస్తుంది.

స్క్రీన్ షాట్‌, షెడ్యూల్డ్ రికార్డ్

పిల్లలు అస‌భ్య‌క‌ర‌ ఫోటోలు లేదా వీడియోలు చూస్తున్నారా అనే విషయం తెలుసుకోవచ్చు. అవసరమైతే రికార్డింగ్‌ను షెడ్యూల్ చేయవచ్చు. ఇలా చేసి వారికి సరైన కంటెంట్ వైపు దారి చూపించవచ్చు.

35
లొకేషన్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్

లైవ్ లొకేష‌న్‌:

హై-ప్రెసిషన్ GPS ద్వారా పిల్లల ప్రస్తుత లొకేషన్ తెలుసుకోవచ్చు. గతంలో వారు వెళ్లిన మార్గాలు కూడా చూడవచ్చు.

జియో ఫెన్సింగ్ అల‌ర్ట్స్:

తల్లిదండ్రులు కొన్ని ప్రాంతాలను సెట్ చేయవచ్చు. పిల్లలు ఆ ప్రాంతాలను దాటితే వెంటనే అలర్ట్ వస్తుంది. ఇది 24 గంటలు గార్డ్‌లా పని చేస్తుంది.

45
సోషల్ మీడియా పర్యవేక్షణ, కంటెంట్ కంట్రోల్

పిల్లలు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యాప్ వాటిని గమనించేందుకు సహాయపడుతుంది.

సింక్ యాప్ నోటిఫికేష‌న్

పిల్లల సోషల్ మీడియా చాట్ నోటిఫికేషన్లు రియల్ టైమ్‌లో సింక్ అవుతాయి. సైబర్ బుల్లీయింగ్ లేదా ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ లభిస్తుంది.

సెన్సిటివ్ కంటెంట్ డిటెక్ష‌న్

టిక్‌టాక్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో సున్నితమైన కంటెంట్‌ను గుర్తించి నియంత్రించవచ్చు.

బ్రౌజ‌ర్ సేఫ్టీ

అనుచిత వెబ్‌సైట్లను ఫిల్టర్ చేయవచ్చు. పిల్లల వయసుకు తగిన కంటెంట్ మాత్రమే చూడేలా సెట్టింగ్స్ మార్చవచ్చు.

55
స్క్రీన్ టైమ్ నియంత్రణ, యాప్ యూజ్ నియమాలు

స్క్రీన్ టైమ్ లిమిట్స్

పిల్లలు క్లాస్ సమయంలో ఫోన్ వాడకుండా టైమ్ లిమిట్ పెట్టవచ్చు. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఫోన్ వాడేలా షెడ్యూల్ సెట్ చేయవచ్చు.

యాప్ రూల్స్

కొన్ని యాప్స్ వినియోగాన్ని పరిమితం చేయవచ్చు. కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు లేదా డిలీట్ చేసినప్పుడు తల్లిదండ్రులకు అలర్ట్ వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories