ఆపిల్ మడతపెట్టె ఐఫోన్ ఎప్పుడైన చూసారా.. ఇండియాలో దీని ధర లాంచ్ ఎప్పుడంటే ?

First Published | May 5, 2021, 1:22 PM IST

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్  మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ గురించి వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నయి. అయితే తాజాగా  భద్రతా విశ్లేషకుడు మింగ్-చి కుయో ఆపిల్ 8 అంగుళాల డిస్ ప్లేతో ఫోల్డబుల్ ఫోన్‌పై పనిచేస్తుందని పేర్కొన్నారు.
 

మింగ్-చి కుయో ప్రకారం ఆపిల్ 2023లో మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను 8 అంగుళాల క్యూహెచ్‌డి + ఫ్లెక్సిబుల్ ఓఎల్‌ఇడి డిస్‌ప్లేతో విడుదల చేయనున్నట్లు సూచించారు. మింగ్-చి కుయో నివేదికను మొదట ఆపిల్ ట్రాకర్ మాక్‌రూమర్స్ ప్రచురించింది. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ డిస్‌ప్లేను ఎస్‌డిసి సరఫరా చేస్తుందని మింగ్-చి కువో తెలిపింది.
undefined
మింగ్-చి కుయో ప్రకారం 2023 నాటికి 15-20 మిలియన్ ఫోల్డబుల్ ఐఫోన్‌లను విక్రయించాలని ఆపిల్ యోచిస్తోందట. ఫోల్డబుల్ ఐఫోన్ డిస్‌ప్లేలో సిల్వర్ నానోవైర్ టచ్ సొల్యూషన్ లభిస్తుంది, ఇది ఫోన్ జీవితాన్ని పొడిగిస్తుందని మింగ్-చి కుయో నివేదిక పేర్కొంది. ఈ డిస్ ప్లే టెక్నాలజీ కూడిన ఫోన్‌లకు లాంగ్ లైగ్ ఉంటుందట.
undefined

Latest Videos


గత ఏడాది నవంబర్‌లో ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2022 నాటికి విడుదల చేయనున్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఫోల్డబుల్ ఫోన్ గురించి ఆపిల్ తైవానీస్ సరఫరాదారులు హన్ హై అండ్ నిప్పన్ నిప్పన్‌లతో చర్చలు జరుపుతోంది.
undefined
ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ఓ‌ఎల్‌ఈ‌డి లేదా మైక్రోలెడ్ స్క్రీన్‌తో వస్తుందని కూడా చెబుతున్నారు. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ డిస్‌ప్లేని శామ్సంగ్ సరఫరా చేస్తుంది. మరో నివేదిక ప్రకారం ఐఫోన్ ఫోల్డబుల్ డిస్ ప్లే పై టెస్టింగ్ కూడా జరుగుతోందని తెలిపింది.
undefined
click me!