ఏటియం పిన్ మర్చిపోయారా.? కొత్త పిన్ నంబర్‌ ఈజీగా పొందడానికి ఇలా చేయండి.. !

మీరు మీ ATM కార్డ్ పిన్ నంబర్‌ను మరచిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ATM మెషీన్ లేదా ఆన్‌లైన్ ద్వారా మనం సురక్షితంగా కొత్త పిన్ నంబర్‌ను  పొందవచ్చు.

ATM Forgot PIN? There are two ways to get a new pin number easily!-sak

ఎటిఎం కార్డు
ఇప్పుడు చాలా మంది డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లడం లేదు. ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే ఏటీఎం కార్డు పిన్ నంబర్‌ను మరిచిపోతే డబ్బులు  విత్‌డ్రా చేయలేరు. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు. ATM మెషీన్ ఇంకా  ఆన్‌లైన్ ద్వారా మనం సురక్షితంగా కొత్త పిన్ నంబర్‌ను రూపొందించవచ్చు.

ATM కార్డ్ పిన్

ముందుగా మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు ATMకి వెళ్లండి. ఇతర బ్యాంక్ ATM ద్వారా పిన్ మార్చలేరు.

ATM Forgot PIN? There are two ways to get a new pin number easily!-sak

ATM పిన్ ఎలా మార్చాలి

బ్యాంకు అకౌంట్ ఉన్న ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మెషీన్‌లో కార్డును ఇన్‌సర్ట్ చేసిన తర్వాత ఫర్ గెట్  పిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.


ATM కార్డ్ పిన్ మార్చండి

బ్యాంకు అకౌంట్ కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను టైప్ చేయమని కోరుతూ స్క్రీన్‌పై మెసేజ్  కనిపిస్తుంది. తర్వాత atm మెషీన్‌లో మొబైల్ నంబర్‌ని టైప్ చేయండి.


మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత ఆ నంబర్‌కు  OTP  వస్తుంది. దానిని atm మెషీన్‌లో టైప్ చేసిన తర్వాత, మీకు కొత్త ATM పిన్‌ని రూపొందించడానికి ఒక అప్షన్ చూపిస్తుంది.

ఏటీఎం పిన్‌ను ఆన్‌లైన్‌లో కూడా మార్చుకోవచ్చు. ATM PINని అకౌంట్ హోల్డర్ బ్యాంక్ అఫీషియల్ నెట్‌బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లో మార్చవచ్చు.

ATM పిన్ చేంజ్ అప్షన్స్  

ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత ATM కార్డ్ విభాగానికి వెళ్లి PIN change అప్షన్ పై క్లిక్ చేయండి.

ATM పిన్ జనరేషన్ 

ఆ తర్వాత ఏటీఎం కార్డుపై సీవీవీ, కార్డ్ నంబర్ చివరి కొన్ని అంకెలు, వాలిడిటీ  తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.

ATM PINని రీజెనరేట్ 

ఆ తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ తో  రిజిస్టర్  చేసుకున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్  చేస్తే ఆ నంబర్‌కు OTP వస్తుంది. మీరు స్క్రీన్‌పై దానిని  టైప్ చేసి కొత్త పిన్‌ను రూపొందించవచ్చు.

Latest Videos

vuukle one pixel image
click me!