ఈ ఈవెంట్‌లో ఏ ఉత్పత్తులు ఆవిష్కరించనున్నారో సమాచారం వెల్లడించనప్పటికీ, ఆపిల్ మీడియా ఆహ్వానాలను కూడా పంపించడం ప్రారంభించింది. సమాచారం ప్రకారం ఆపిల్ కొత్త ఐఫోన్‌లు సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ఆపిల్ ఈవెంట్‌లో విడుదల చేస్తుంది. ఇప్పుడు ఈ సమవత్సరంలో ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14న రాత్రి 10.30 గంటలకు మొదలవుతుంది.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆపిల్ ఈవెంట్ స్ప్రింగ్ లోడ్ లో కొత్త ఐప్యాడ్ ఐప్యాడ్ ప్రో ప్రారంభించారు. అయితే ఐఫోన్ 13 సిరీస్ కాకుండా ఆపిల్ వాచ్ సిరీస్ 7, ఎయిర్‌పాడ్స్ 3ని రానున్న ఈవెంట్‌లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆపిల్ ఐప్యాడ్ ప్రో (2021)ను ఇన్‌హౌస్ ఎం1 చిప్‌సెట్‌తో పరిచయం చేసింది. ఇంతకుముందు ఈ చిప్‌సెట్ గత సంవత్సరం మాక్‌బుక్స్, మాక్ మినీలో ఉపయోగించారు. ఐమాక్ (2021) కూడా ఎం1 చిప్‌తో అందిస్తున్నారు.
ఐఫోన్ 13కి సంబంధించి ఇప్పటికే వివిధ లీకైన నివేదికలు బయటకు వచ్చాయి. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఐఫోన్ 13తో అందుబాటులో ఉంటుందని ఒక నివేదిక పేర్కొంది, అయితే ఈ ఫీచర్ కేవలం ఎంచుకున్న మార్కెట్ కోసం మాత్రమే అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఫీచర్ సహాయంతో నెట్‌వర్క్ లేకపోయినా మనం కాల్స్ మాట్లాడుకొవచ్చట.
అంతేకాకుండా ఐఫోన్ 13 సిరీస్ ఐఫోన్ 12 సిరీస్ కంటే పెద్ద బ్యాటరీతో లాంచ్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కొత్త ఐఫోన్‌లు ఐఓఎస్ 15తో వస్తాయి అని కొన్ని నేవిదికలు చెబుతున్నాయి అయితే దీని గురించి ఆపిల్ అధికారికంగా ప్రకటించలేదు.