ఆపిల్ ఈవెంట్ 2021: ఐప్యాడ్, వాచ్ 7తో ఐఫోన్ 13 సిరీస్ లాంచ్.. ప్రారంభ ధర ఎంతంటే ?

First Published | Sep 15, 2021, 12:46 PM IST

 క్యుపెర్టినో దిగ్గజం ఆపిల్ 2021 అతిపెద్ద ఈవెంట్‌లో  సరికొత్త ఉత్పత్తులను ఒకేసారి విడుదల చేసింది.  ఆపిల్ ఈవెంట్ 2021లో లాంచ్ చేసిన మొదటి ఉత్పత్తి ఐప్యాడ్ 2021. ఈ ఐప్యాడ్ 2021 10.2-అంగుళాల డిస్‌ప్లే, A13 చిప్‌సెట్‌తో పరిచయం చేశారు. ఐప్యాడ్ కాకుండా సంస్థ ఐప్యాడ్ మినీని కూడా ప్రవేశపెట్టింది. 

ఐప్యాడ్ మినీలో టచ్ ఐడి కూడా అందించారు. అంతే కాకుండా దాని డిస్‌ప్లే బ్రైట్ నెస్ 500 నిట్స్. ఏ13 బయోనిక్ చిప్‌సెట్ కూడా ఇందులో  ఇచ్చారు. టైప్ సి పోర్ట్ ఐప్యాడ్ మినీలో లభిస్తుంది. కొత్త ఐప్యాడ్‌లో 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కొత్త ఐప్యాడ్ వై-ఫై వెర్షన్ ధర భారతదేశంలో రూ. 30,900 కాగా, వై-ఫై ఇంకా  సెల్యులార్ నెట్ వర్క్ ధర రూ. 42,900 నుంచి ప్రారంభమవుతుంది.

ఆపిల్ ఐప్యాడ్ మినీ

ఐప్యాడ్ మినీలో 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. దీనికి స్మార్ట్ హెచ్‌డి‌ఆర్ కూడా ఇచ్చారు. దీనితో మీరు 4కే వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా లభిస్తుంది. దీనితో పాటు హెచ్‌డి‌ఆర్ సపోర్ట్  కూడా ఉంది. స్టీరియో స్పీకర్ కూడా అందించారు. దీనికి ఐదు రంగులలో పరిచయం చేశారు. దీనికి ఆపిల్ పెన్సిల్ 2వ జనరేషన్,  5జి సపోర్ట్ కూడా ఉంది. దీనిలో ఐపాడ్ ఓఎస్ 15 ఉంది. దీని ప్రారంభ ధర  499 డాలర్లు  అంటే దాదాపు రూ .36,746.

Latest Videos


ఆపిల్ వాచ్ సిరీస్ 7

ఆపిల్ వాచ్ సిరీస్ 7 అన్ని రకాల రైడింగ్‌లను (సైకిల్-బైక్) గుర్తించగలదు ఇంకా ఫాల్ డిటెక్షన్‌ కూడా ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్‌లో రెటీనా డిస్‌ప్లే ఇచ్చారు. డిస్ ప్లే అంచులు పాత మోడల్ కంటే మెత్తగా ఉంటాయి. బటన్ల డిజైన్ అలాగే సైజు కూడా మార్చారు. దీనితో పాటుగా కొత్త వాచ్ ఫేస్‌లు కూడా ఇచ్చారు. ఆపిల్ వాచ్ సిరీస్ 7 సంస్థ అత్యుత్తమ వాచ్ అని కంపెనీ పేర్కొంది. దీనికి  ఐ‌పి6ఎక్స్ రేటింగ్ వచ్చింది. మీరు ఈ వాచ్ ని ఎక్కడికైనా  తీసుకేళ్ళచ్చు. దీని బ్యాటరీ లైఫ్ రోజంతా  ఉంటుందని క్లెయిమ్ చేయబడింది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 7ను ఐదు కొత్త అల్యూమినియం రంగులలో కొనుగోలు చేయవచ్చు. దీనిలో నైక్ ఎడిషన్ కూడా ప్రవేశపెట్టరు. ఆపిల్ వాచ్ సిరీస్ ప్రారంభ ధర $ 399 అంటే సుమారు రూ .29,380.68.

ఆపిల్ సంస్థ ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ను కూడా విడుదల చేసింది. ఐఫోన్ 13 డిజైన్ సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. మొదటి చూపులో ఐఫోన్ 12 సిరీస్ లాగానే కనిపిస్తుంది. అన్ని ఐఫోన్లు అల్యూమినియం బాడీతో తయారు చేశారు ఇంకా అన్ని మోడల్స్ ఐ‌పి68 రేట్ పొందాయి. ఐఫోన్ 13 సిరీస్ బ్రైట్ నెస్ 1200 నిట్స్. డిస్‌ప్లే ఓ‌ఎల్‌ఈ‌డి. డాల్బీ విజన్ ఫోన్‌కి సపోర్ట్ చేస్తుంది. ఏ15 బయోనిక్ చిప్‌సెట్ ఫోన్‌లో ఇచ్చారు.

ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఐఫోన్ 13 సిరీస్‌లో సినిమాటిక్ మోడ్ ఉంటుంది, దీని సహాయంతో మీరు ఏదైనా ఖరీదైన కెమెరా వంటి వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ మోడ్‌లో మీరు ఏ సమయంలోనైనా ఏదైనా దానిపై ఫోకస్ లేదా డిఫోకస్ పెట్టవచ్చు. దీనికి ఆటోమేటిక్ ఫోకస్ ఛేంజ్ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో కూడా వస్తుంది. ఐఫోన్ 13 సిరీస్ అన్ని మోడళ్లలో 5జి సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 13కి సంబంధించి ఏదైనా నెట్‌వర్క్‌లో  ఫాస్ట్ అండ్ స్పీడ్ 5జిని పొందుతుందని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ 13తో అత్యుత్తమ 5జి అనుభవాన్ని పొందుతారని తెలిపింది. బ్యాటరీ విషయానికొస్తే, ఐఫోన్ 13 మినీ బ్యాటరీ ఐఫోన్ 12 కన్నా 2.5 గంటల ఎక్కువ బ్యాకప్‌ని కలిగి ఉంది. ఈ సిరీస్‌తో కూడా ఐఫోన్ 12 సిరీస్ వంటి ఛార్జింగ్ అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. కంపెనీ కొత్త లెదర్‌మాగ్‌సేఫ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఐఫోన్ 13 మినీ ప్రారంభ ధర $ 699 డాలర్లు అంటే రూ.51,468, ఐఫోన్ 13 ప్రారంభ ధర $ 799 డాలర్లు అంటే రూ.58,831. ఐఫోన్ 13 సిరీస్‌తో 64జి‌బి స్టోరేజ్ అందుబాటులో ఉండదు. స్టోరేజ్ కోసం, 128జి‌బి, 256 జి‌బి, 512జి‌బి ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 13 ప్రో అండ్ ఐఫోన్ 13 ప్రో మాక్స్

ఆపిల్ ఐఫోన్ 13 ప్రో అండ్ ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లను కూడా విడుదల చేసింది. మొదటి మోడల్‌ ఐఫోన్ 13తో పోలిస్తే రెండు ప్రో మోడల్స్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఐఫోన్ 13 ప్రోని నాలుగు రంగులలో ప్రవేశపెట్టరు. ఐఫోన్ 13 ప్రో బ్రైట్ నెస్ 1200 నిట్స్, డిస్‌ప్లే గరిష్ట రిఫ్రెష్ రేటు 120Hz. దీనితో ప్రమోషన్‌కు కూడా సపోర్ట్ ఉంది. ఐఫోన్ 13 ప్రోలో సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది. దీనితో 5జికి సపోర్ట్ కూడా ఉంది. ఐఫోన్ 13 ప్రో 6.1, 6.7 అంగుళాల పరిమాణాల్లో అందుబాటులో ఉంటుంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరాతో అందుబాటులో ఉంటుంది.

మాక్రో మోడ్ ఐఫోన్ 13 ప్రోలో కూడా అందించారు. ఆపిల్ ఐఫోన్‌లలో మాక్రో మోడ్‌ను ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రత్యేక విషయం ఏమిటంటే మాక్రో మోడ్ నైట్ మోడ్‌లో కూడా పని చేస్తుంది. టెలిఫోటో లెన్స్ కూడా ఐఫోన్ 13ప్రొతో అందించారు. ఈ సంవత్సరం చివరి నాటికి ప్రోరెస్ వీడియో అనే ఫీచర్‌కి అప్‌డేట్ కూడా ఉంటుంది. ఐఫోన్ 13 ప్రో బ్యాటరీకి సంబంధించి ఒక రోజు పూర్తిగా బ్యాకప్ ఉంటుందని  క్లెయిమ్ చేయబడింది. ఐఫోన్ 13 ప్రో ప్రారంభ ధర  999 డాలర్లు అంటే రూ.73,557.  ఫోన్ 13 ప్రో మాక్స్ ప్రారంభ ధర 1099 డాలర్లు అంటే రూ.80,921 . సేల్స్ సెప్టెంబర్ 24 నుండి ప్రారంభమవుతాయి.

click me!