Amazon Freedom Sale: ఆగస్ట్ 15 సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్...స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్

Published : Aug 12, 2026, 01:43 PM IST

Amazon Freedom Sale: ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్‍లో 'గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026' నడుస్తోంది. ఈ స్పెషల్ సేల్ లో స్మార్ట్ ఫోన్ లపై 40% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అవెంటో చూసేద్దాం.

PREV
14
గ్రేట్ ఫ్రీడమ్ సేల్

ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్‍లో 'గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026' నడుస్తోంది. ప్రైమ్, నాన్-ప్రైమ్ కస్టమర్లు అందరూ ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. యాపిల్, శాంసంగ్, గూగుల్, వివో, మోటోరోలా, వన్‌ప్లస్ లాంటి టాప్ బ్రాండ్ల ఫోన్లను ఆఫర్ ధరలకు కొనడానికి ఇదే మంచి అవకాశం.

24
ప్రీమియం ఫోన్లకు మెగా ఆఫర్

కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక మంచి ఛాన్స్. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ.94,999 నుంచి రూ.89,999కి తగ్గింది. రూ.1,19,999 విలువైన వివో X300 FE 5G ఇప్పుడు రూ.89,999కే అందుబాటులో ఉంది. 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ ఎయిర్ మోడల్‌పైనా భారీ డిస్కౌంట్ ఉంది. రూ.1,19,900 ధర ఉన్న ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.97,900కు అమ్ముతున్నారు.

ఫోల్డబుల్ ఫోన్‌పైనా ఆఫర్

శాంసంగ్ ప్రీమియం ఫోల్డబుల్ మోడల్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా 5G ధరను కూడా ఈ సేల్‌లో తగ్గించారు. రూ.2,24,999 విలువైన ఈ ఫోన్ ఇప్పుడు రూ.1,99,999కే లభిస్తోంది. అలాగే, రూ.1,66,899 అసలు ధర ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256 జీబీ మోడల్ ఆఫర్ ధర ఇప్పుడు రూ.1,56,399.

34
మిడ్-రేంజ్ ఫోన్లకూ సూపర్ డీల్స్

ప్రీమియం ఫోన్లే కాదు, మిడ్-రేంజ్ ఫోన్లపైనా సూపర్ డీల్స్ ఉన్నాయి. రూ.94,999 విలువైన మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ 5G ఇప్పుడు రూ.58,959కే దొరుకుతోంది. గూగుల్ పిక్సెల్ 10 మోడల్ ధర కూడా తగ్గింది. దీని ధరను రూ.79,999 నుంచి రూ.66,250కి తగ్గించారు.

S26 అల్ట్రాపైనా ధర తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G కొనాలనుకునే వారికి కూడా ఈ సేల్‌లో మంచి అవకాశం ఉంది. రూ.1,69,999 విలువైన ఈ ఫోన్, రూ.1,24,999కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 15 ఫోన్ ధరను కూడా తగ్గించారు. రూ.89,999 మోడల్ ఇప్పుడు రూ.85,999కు అమ్ముతున్నారు.

44
బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి

డైరెక్ట్ డిస్కౌంట్లు కాకుండా, కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈజీ ఈఎంఐ లావాదేవీల ద్వారా 10% వరకు తక్షణ డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా, నో-కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్, కూపన్ డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డ్ వంటి అదనపు ఆఫర్లు కూడా ఒక్కో వస్తువుకు వేర్వేరుగా ఉంటాయి.

అమెజాన్ పే యూజర్లకూ ప్రయోజనం

అమెజాన్ పే వాడే కస్టమర్లకు అదనంగా ఆదా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు, అర్హత ఉన్న లావాదేవీలపై క్యాష్‌బ్యాక్, రివార్డులు పొందవచ్చు.

కస్టమర్ లొకేషన్‌ను బట్టి, కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సేమ్-డే డెలివరీ సౌకర్యం కూడా ఉంది. సేల్ ముగిసేలోపు మీకు నచ్చిన మోడళ్ల ప్రస్తుత ధర, బ్యాంక్ ఆఫర్లను చెక్ చేసుకుని కొనడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories