Smartphone: చూడ్డానికి అచ్చంగా ఐఫోన్‌లా ఉంది క‌దూ.. ధ‌ర మాత్రం కేవ‌లం రూ. 8 వేలు మాత్ర‌మే

Published : Aug 12, 2026, 11:01 AM IST

Smartphone: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా స్మార్ట్‌4 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను త‌క్కువ ధ‌ర‌లోనే మంచి లుక్‌, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.

PREV
14
త‌క్కువ బ‌డ్జెట్‌, రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్స్

లావా స్మార్ట్‌4 ధర రూ.8,499గా నిర్ణయించారు. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కోణార్క్ గోల్డ్‌, అజంతా గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ మొబైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఈఎంఐ వంటి సులభ ఫైనాన్స్ సౌకర్యాలు కూడా కంపెనీ అందిస్తోంది.

24
డిస్‌ప్లే, ప్రాసెసర్ విష‌యానికొస్తే..

ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల LCD డిస్‌ప్లే ఇచ్చారు. దీనికి క్యూహెచ్‌డీ రిజల్యూషన్ ఉంది. అంటే ప్రస్తుతం ఎక్కువ బడ్జెట్ ఫోన్లలో కనిపించే 720p డిస్‌ప్లేల కంటే తక్కువ క్లారిటీ ఉండే అవకాశం ఉంది. అయితే 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ కొంత స్మూత్‌గా అనిపిస్తుంది. ఫోన్‌కు యూనీసాక్ SC9863A ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది సాధారణ పనులైన కాల్స్, వాట్సాప్, వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి అవసరాలకు సరిపోతుంది. ఇందులో ఉన్న 3GB RAMను మరో 3GB వరకు వర్చువల్ RAMగా పెంచుకునే అవకాశం కూడా ఉంది.

34
కెమెరా, బ్యాటరీ, ఇతర ఫీచర్లు

Lava Smart 4 వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ అండ్రాయిడ్ 16 గో ఎడిష‌న్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌నిచేస్తుంది. తక్కువ సామర్థ్యం ఉన్న హార్డ్‌వేర్‌పై కూడా వేగంగా పనిచేసేలా ఈ వెర్షన్‌ను రూపొందించారు. ఇక బ్యాట‌రీ విష‌యానికొస్తే ఇందులో 19 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని ఇచ్చారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్టుకు స‌పోర్ట్ చేస్తుంది. ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండటంతో త‌క్కువ ఎత్తు నుంచి ప‌డిపోతే త‌ట్టుకునేలా రూపొందించారు. అంతేకాకుండా డ్యూయల్ 4G సిమ్ సపోర్ట్ కూడా ఉంది.

44
ఈ ఫోన్‌కి ఎవ‌రికి బెస్ట్ ఆప్ష‌న్ అంటే.?

ధరను బట్టి చూస్తే లావా స్మార్ట్‌4 సాధార‌ణ యూజ‌ర్ల కోసం తీసుకొచ్చిన ఫోన్‌. అయితే హైక్వాలిటీ వీడియోల‌ను అదే రిజ‌ల్యూష‌న్‌తో చూడాల‌నుకునే వారికి ఈ ఫోన్ అంత‌గా సెట్ అవ్వ‌క‌పోవ‌చ్చు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ వీడియోల‌ను హై క్వాలిటీలో చూసే అవ‌కాశం ఉండ‌దు. కాబ‌ట్టి ఈ ఫోన్ కొనుగోలు చేసే ముందు డిస్‌ప్లే నాణ్యత, పనితీరు గురించి యూజ‌ర్ల రివ్యూలు, లేదా స్వ‌యంగా చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. మొదటిసారి స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారికి లేదా రెండో ఫోన్‌గా మాత్రమే కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories