హెచ్చరిక: నవంబర్ నుండి ఈ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. అదేంటో తెలుసుకోండి..

First Published | Sep 27, 2021, 5:11 PM IST

ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గోప్యత, భద్రతకు సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటుంది. అయితే  కొత్త అప్ డేట్ విడుదల తరువాత పాత వెర్షన్లకు సపోర్ట్ నిలిపివేస్తుంది. 

ఇప్పుడు కూడా  గోప్యత, భద్రత సమస్యలను అధిగమించడానికి ప్రతి సంవత్సరంలాగానే కొన్ని వెర్షన్‌ ఫోన్‌లకు వాట్సాప్  సపోర్ట్ నిలిపివేయనుంది. వాట్సాప్ వినియోగదారులు 1 నవంబర్  2021 నుండి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించలేరు. వాటి గురించి తెలుసుకుందాం ...

వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయబోతున్న ఫోన్‌లలో ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్, కైఓఎస్ డివైజెస్ ఉన్నాయి. వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయబోతున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 4.0.4 లేదా అంతాకంటే పాత వెర్షన్‌ ఫోన్ల పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఫోన్‌లు ఉన్నాయి.


ఆండ్రాయిడ్ డివైజెస్

మీ దగ్గర ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.4 ఉన్న పాత ఫోన్ ఉంటే నవంబర్ 1 తర్వాత మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదు. ఈ జాబితాలో స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్II, గెలాక్సీ ఎస్3 మినీ, ఆప్టిమస్ ఎల్5 డ్యుయల్, ఆప్టిమస్ ఎల్4 II డ్యుయల్, ఆప్టిమస్ ఎఫ్7, ఆప్టిమస్ ఎఫ్5 వంటి ఫోన్‌ల పేర్లు ఉన్నాయి.
 

ఐ‌ఓ‌ఎస్ డివైజెస్

ఐ‌ఓ‌ఎస్ గురించి మాట్లాడి‌తే ఐ‌ఓ‌ఎస్ 10, అంతకంటే పై వెర్షన్‌లలో వాట్సాప్ పని చేస్తుంది. ఎవరైనా ఐ‌ఓ‌ఎస్ 9 ఉన్న ఐఫోన్ ఉంటే నవంబర్ 1 నుండి వాట్సాప్ అందులో పనిచేయదు. ఈ జాబితాలో ఐఫోన్  6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ1 మొదలైనవి ఉన్నాయి.
 

కైఓ‌ఎస్(kaiOS) డివైజెస్

జియో ఫోన్, జియో ఫోన్ 2 కాకుండా ఇతర నోకియా ఫోన్‌లలో కూడా కైఓ‌ఎస్ ఇచ్చారు. కైఓఎస్ 2.5.0 లేదా అంతకంటే పై వెర్షన్ ఉన్న ఫోన్‌లలో వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. జియో ఫోన్, జియో ఫోన్ 2లలో వాట్సాప్ సపోర్ట్ ఎప్పటిలాగే కొనసాగుతుంది.

Latest Videos

click me!