సిమ్ కార్డ్ నియమాలలో మార్పు.. ఇక ఈ వయస్సు వారికి సిమ్ లభించదు..

First Published | Sep 25, 2021, 6:06 PM IST

భారతదేశంలో మైనర్లకు సిమ్ కార్డులు జారీ చేయరాదని టెలికమ్యూనికేషన్ల విభాగం (డిఓటి) తెలిపింది. అంటే ఇప్పుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి దేశంలోని ఏ టెలికాం ఆపరేటర్ నుండి సిమ్ కార్డును కొనుగోలు చేయలేరు. టెలికాం ఆపరేటర్ మైనర్‌కు సిమ్ కార్డు అమ్మడం చట్టవిరుద్ధమైన చర్య అని డిఓటి తెలిపింది. ప్రభుత్వ ఈ నిర్ణయం గురించి వివరంగా మీకోసం...
 

సి‌ఏ‌ఎఫ్ ఫారమ్ నింపిన తర్వాత మాత్రమే సిమ్ కార్డ్ జారీ

కొత్త సిమ్ కొనడానికి కస్టమర్ అక్విజిషన్ ఫారం (CAF)ని నింపాలి. సి‌ఏ‌ఎఫ్ అనేది సాధారణంగా టెలికాం కంపెనీ, కస్టమర్ మధ్య ఒక ఒప్పందం. ఈ ఫారమ్ ఇప్పుడు సవరించారు, దీని ప్రకారం సిమ్ కార్డ్ కొనుగోలు చేసే వారి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అంతే కాకుండా ఒక వ్యక్తి మానసిక పరిస్థితి బాగోలేకపోతే అతనికి సిమ్ కార్డును విక్రయించలేరు. 

ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ?

ఇది చాలా సాధారణ ప్రశ్న, అలాగే ప్రతిసారీ అడుగుతుంటారు కానీ ఖచ్చితమైన సమాధానం లేదు. సాధారణంగా ఒక వ్యక్తి తన పేరు మీద గరిష్టంగా 9 సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చని చెబుతుంటారు అయితే అలాంటిది ఏమి ఉండదు. ఒక వ్యక్తి తన పేరు మీద గరిష్టంగా 18 సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. వీటిలో 9 మొబైల్ కాల్స్ కోసం, మిగిలిన 9 మెషిన్-టు-మెషిన్ (M2M) కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడతాయి.
 

Latest Videos


కేవలం ఒక రూపాయితో సిమ్ కార్డ్

ఇటీవల ప్రభుత్వం సిమ్ కార్డులను తీసుకునే నియమాలలో మార్పులు చేసింది, దీని ప్రకారం మీరు సిమ్ కార్డు పొందడానికి ఫిజికల్ కి బదులుగా డిజిటల్ కే‌వై‌సి ఉండాలి.  అంటే వినియోగదారులు ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పోస్ట్‌పెయిడ్ సిమ్‌ను ప్రీపెయిడ్‌గా మార్చడానికి ఎలాంటి పేపర్ అవసరం లేదు. నెట్‌వర్క్ ప్రొవైడర్ కంపెనీ యాప్ ద్వారా వినియోగదారులు  కే‌వై‌సి అప్ డేట్ చేసుకోవచ్చు. దీని కోసం కేవలం రూ.1 మాత్రమే కస్టమర్ల నుండి వసూలు చేయబడుతుంది.

click me!