భారతదేశంలో ఐఫోన్ 13 బేస్ మోడల్ (128జిబి) ధర రూ .79,900. ఈ సిరీస్‌లో చౌకైన మోడల్ ఐఫోన్ 13 మినీ 128జిబి వేరియంట్ కొనుగోలు ధర రూ. 69,900. భారతదేశంలో ఆవరేజ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల ప్రకారం ఐఫోన్ 13 ధర చాలా ఎక్కువ అని స్పష్టమవుతోంది. చాలా మంది ప్రజలు ఇంత ఖరీదైన ఫోన్ కొనడానికి ఇష్టపడరు ఇంకా కేవలం 15 ధరకే స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇష్టపడతారు.
ప్రతి దేశంలో ఐఫోన్ ఖరీదైనది కాదు
అయితే ప్రతి దేశంలో ఐఫోన్ ధర ఒకేలా ఉండదు. దీనికి ఒక కారణం ఏమిటంటే కొత్త ఐఫోన్‌ల ధర వివిధ దేశాలలో విభిన్నంగా ఉంటుంది. ఐఫోన్ ధర అత్యధికంగా ఉన్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. దీనికి అధిక దిగుమతి పన్ను కారణమని చెప్పవచ్చు. ఐఫోన్‌ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసే దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఐఫోన్ 13 బేస్ మోడల్ ధర అమెరికాలో 799 డాలర్లు అంటే సుమారు రూ .59 వేలు మాత్రమే.
కానీ అమెరికా వంటి దేశాలలో ఐఫోన్‌లు చౌకగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. దీనికి కారణం అక్కడి దేశ పౌరుల సగటు సంపాదన. కొత్త ఐఫోన్‌ల ధరలను చూసి వివిధ దేశాల్లోని వ్యక్తుల సగటు ఆదాయాలను ఒక కొత్త నివేదిక పోల్చింది. ఈ నివేదికలోని డేటా చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఒక వ్యక్తి కొత్త ఐఫోన్ కొనడానికి వివిధ దేశాలలో ఎన్ని గంటలు పని చేయాల్సి ఉంటుందో ఈ నివేదికలో తెలిపింది.
అమెరికాలో ఆరు గంటల పాటు
ఈ రీసర్చ్ మనీ సూపర్ మార్కెట్ ద్వారా జరిగింది. కొత్త ఐఫోన్ 13 కొనేందుకు డబ్బు సంపాదించడానికి యుఎస్‌లో సగటున సంపాదిస్తున్న వ్యక్తి 49.5 గంటలు పని చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. అమెరికాలో సగటున సంపాదిస్తున్న వ్యక్తి ఐఫోన్ కొత్త మోడల్ కొనడానికి సుమారు ఆరు రోజులు పని చేయల్సి ఉంటుంది.
లక్సెంబర్గ్, సింగపూర్, నార్వే, ఆస్ట్రేలియా, హాంకాంగ్ వంటి దేశాలలో సగటు సంపాదిస్తున్న వ్యక్తి ఐఫోన్ 13 కొనడానికి ఐదు నుండి ఎనిమిది రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, సింగపూర్‌లో సగటున సంపాదిస్తున్న వ్యక్తి కేవలం 34.3 గంటలు అంటే దాదాపు మూడు రోజులు పని చేయడం ద్వారా కొత్త ఐఫోన్ కొనడానికి తగినంత డబ్బు సంపాదించవచ్చు. అయితే, ఈ నివేదికలో భారతదేశం గురించి కొంత భిన్నంగా కనిపిస్తుంది.
భారతదేశంలో
దీని ప్రకారం, భారతదేశంలో సగటు సంపాదన కలిగిన వ్యక్తి కొత్త ఐఫోన్ కొనడానికి 724.2 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 30 రోజుల వ్యవధి. ప్రతిరోజు ఎనిమిది గంటల షిఫ్ట్ అనుకుంటే, ఒక సగటు సంపాదిస్తున్న వ్యక్తి భారతదేశంలో ఐఫోన్ 13 కొనడానికి డబ్బును సంపాదించడానికి 30 రోజుల కంటే కొంచెం ఎక్కువ రోజులు పని చేయాల్సి ఉంటుంది. వివిధ గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఒక వ్యక్తి సగటు జీతం కేవలం 30 వేల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.