అయితే ఈ రెండు కాకుండా వాట్సాప్ ని డౌన్‌లోడ్ చూసుకోవడానికి థర్డ్ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే వీటి నుండి ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ప్రమాదకరం. ఇప్పుడు వాట్సప్ కొత్త వెర్షన్ చాలా వైరల్ అవుతోంది, దీనిని ప్రజలు ఫోన్‌లలో థర్డ్ పార్టీ సోర్స్ లేదా ఏపికే ఫైల్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఈ కొత్త వెర్షన్ పేరు ఎఫ్‌ఎం వాట్సప్ కానీ ఇది మీకు చాలా ప్రమాదకరం. దీనిని ఎందుకు, ఎలా నివారించాలో తెలుసుకోండి..
ఎఫ్‌ఎం వాట్సప్ అంటే ఏమిటి?
మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే వాట్సప్ కొత్త వెర్షన్ పేరు ఎఫ్‌ఎం వాట్సప్, అంటే అసలైన వాట్సప్ యాప్ కి మోడిఫైడ్ వెర్షన్. ప్రజలు ఈ యాప్‌ని ఏపికే లేదా థర్డ్ పార్టీ సోర్స్ నుండి డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఎఫ్‌ఎం వాట్సప్ ద్వారా వాట్సప్ డిలెట్ మెసేజులను కూడా చదవచ్చు.
ఎఫ్‌ఎం వాట్సప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌ని పూర్తిగా కంట్రోల్ చేయగలదు. అంటే మీ అనుమతి లేకుండా మీ ఫోన్‌లోని అన్ని యాప్స్ ఓపెన్ చేయగలదు. ఈ యాప్ మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయవచ్చు.
ఈ ఎఫ్‌ఎం వాట్సప్ 16.80.0 మోడిఫైడ్ వెర్షన్ గురించి సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కీ ప్రజలను హెచ్చరించింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఒరిజినల్ యాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.
క్యాస్పర్ స్కీ ప్రకారం ఎఫ్‌ఎం వాట్సప్ లో ట్రోజన్ ట్రయాడా ఉంది. దినితో పాటు అడ్వర్టైజింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK)కూడా ఉంది. ఈ రెండు కలిసి యూజర్ల ఫోన్ డివైజ్ ఐడి, సబ్ స్క్రైబర్స్ ఐడి, మాక్ అడ్రస్ మొదలైన వాటిని సేకరించి డెవలపర్ రిమోట్ సర్వర్‌కు పంపుతుంది.
ఈ రెండు మాల్వేర్‌లు మీ వాట్సప్ మెసేజెస్ చదువుతాయి ఇంకా గ్యాలరీలో ఫోటోలు, వీడియోలను హ్యాకర్లకు చూపిస్తుంది. ఇతర యాప్‌ల చాటింగ్‌ని కూడా నిశితంగా చూపిస్తుంది. వారు మీకు అనవసరమైన యాడ్స్ కూడా చూపిస్తారు, దీని ద్వారా ప్రజల నుండి డబ్బులు సేకరిస్తాయి. మీ ఫోన్‌లోని పేమెంట్ సర్వీస్ ఆక్టివ్ చేయడం ద్వారా బ్యాంక్ ఖాతా నుండి డబ్బు అదృశ్యమయ్యేల కూడా చేయవచ్చు.