దీని వల్ల అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకప్పుడు మీరు వాడిన మీ పాత నంబర్‌ను ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి తన పేరుతో సిమ్ కార్డ్ పొందితే అప్పుడు మీ పాత నంబర్‌పై ఉపయోగించిన అన్ని బ్యాంక్ ఖాతాలకు లేదా సోషల్ మీడియా ఖాతాలకు అక్సెస్ పొందే అవకాశం ఉంది. ఇది మీ గోప్యతకు పెద్ద ముప్పు కలిగించవచ్చు.
undefined
యుఎస్‌లోని ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం చేసిన ఒక పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే ఇలాంటి పరిశోధనలను ఇంతకుముందు వెల్లడించలేదు. టెలికాం కంపెనీలు పాత నంబర్లను రీసైక్లింగ్ చేసే మొత్తం ప్రక్రియ భద్రత, గోప్యతలపై ప్రశ్నలను లేవనెత్తుతుందని పరిశోధన నివేదికలో పేర్కొంది. మీరు మీ నంబర్‌ను మార్చినప్పుడల్లా మీ అన్ని సోషల్ మీడియా ఖాతాలు, జిమెయిల్ మొదలైన వాటిలో కొత్త ఫోన్ నంబర్‌ను వెంటనే అప్‌డేట్ చేయకపోతే ఇది అతిపెద్ద నష్టం అని పరిశోధన చెబుతోంది.
undefined
మీ పాత నంబర్ ఇ-కామర్స్ యాప్స్ కి కూడా లింక్ చేయబడి ఉంటుంది కాబట్టి మీ పాత నంబరును పొందిన వ్యక్తి వాటికి కూడా అక్సెస్ చేయవచ్చు. ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం ఒక జర్నలిస్ట్ ఒక కొత్త మొబైల్ నంబర్ తీసుకున్నాడు, తరువాత అతనికి బ్లడ్ టేస్ట్స్, స్పా అపాయింట్మెంట్ మెసేజెస్ పొందడం ప్రారంభమయ్యాయి. ఈ పరిశోధన సమయంలో వారానికి 200 రీసైక్లింగ్ నంబర్లను పరిశీలించారు, వీటిలో పాత నంబర్ వాడిన వ్యక్తికి తెలిసిన వారి నుండి సుమారు 19 నంబర్లకు మెసేజులు, కాల్స్ వచ్చాయి. వీటిలో స్టాండర్డ్ మెసేజులు, ఓటిపిలు కూడా ఉన్నాయి.
undefined
పాత నంబర్ నుండి బెదిరింపులుమీ పాత నంబరును పిషింగ్ ఎటాక్ కి కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా హ్యాకర్లు మీ పాత నంబర్‌ను న్యూస్ లెటర్, ప్రచారాలు, సభ్యత్వాలు మొదలైన వాటిలో కూడా ఉపయోగించవచ్చు. మీ పాత నంబర్ మీ ఇ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాలు, ఇ-కామర్స్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
undefined
ఈ రకమైన హ్యాకింగ్‌ను నివారించడానికి సులభమైన, సాధారణమైన మార్గం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి మీ పాత నంబర్ వాడడం ఆపివేసిన వెంటనే లేదా కొత్త నంబర్ వాడటం మొదలు పెట్టిన వెంటనే మీ కొత్త నంబర్‌ను మీ ఇమెయిల్, సోషల్ మీడియా ఖాతా, షాపింగ్ సైట్ ఖాతా మొదలైన వాటిలో అప్ డేట్ చేయడం ముఖ్యమైన విషయం. అంతేకాకుండా బ్యాంకు ఖాతాలో కొత్త నంబర్‌ను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయండి, ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల మీకు పెద్ద నష్టం జరగవచ్చు.
undefined