Airtel 1+1 Recharge Offer : కేవలం ఒక్క నెల రీఛార్జ్ చేస్తే చాలు, మరో నెల ఉచిత టాక్ టైమ్, ఇంటర్నెట్ డేటా పొందే బంపర్ ఆఫర్ ఎయిర్ టెల్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ రీచార్జ్ ఆఫర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
టెలికాం కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్తకొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఇలా ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ కూడా తక్కువ డబ్బులతో ఎక్కువ సేవలు అందించే రీచార్జ్ ప్లాన్స్ ను తన కస్టమర్లకు అందిస్తోంది. తాజాగా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. దీనికి '1+1 రీఛార్జ్ ఫ్రీ' అని పేరు పెట్టింది.
అర్హత కలిగిన యూజర్లకు ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌తో ఒకసారి రీఛార్జ్ చేస్తే, అదే విలువైన మరో రీఛార్జ్ ఉచితంగా పొందవచ్చు… అంటే ఒకటి కొంటే ఇంకోటి ఉచితం అన్నమాట. సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌కి ఈ ఆఫర్ వర్తిస్తే, మొత్తం 56 రోజుల పాటు సర్వీస్‌ను వాడుకోవచ్చు. దీనివల్ల నెలవారీ రీఛార్జ్ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
24
రూ.349 ప్లాన్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి?
ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంది. ఇందులో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉంటాయి. అలాగే అర్హత ఉన్న యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఇస్తోంది. మీ నంబర్‌కు 1+1 ఆఫర్ వర్తిస్తే అదనంగా మరో 28 రోజుల పాటు అదే ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు. అంటే ఒక్కసారి రూ.349 చెల్లిస్తే చాలు… మొత్తం 56 రోజులు సర్వీస్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
అయితే రూ.349 ప్లాన్ లో 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ సేఫ్ లాంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. అయితే ఉచితంగా వచ్చే రెండో రీఛార్జ్‌లో ఈ అదనపు ఫీచర్లు మళ్లీ వస్తాయా లేదా అనేది స్పష్టంగా తెలియదు. దీనిపై ఎయిర్ టెల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
34
రూ.399 ప్లాన్‌లో కూడా ఉచిత రీఛార్జ్ ఛాన్స్
రూ.399 ప్లాన్‌లో కూడా ఎయిర్‌టెల్ ఇదే 1+1 ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ సాధారణంగా 28 రోజులు. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా ఇస్తారని చెబుతున్నారు. ఈ ప్లాన్‌కు అర్హత ఉన్న కస్టమర్లు రీఛార్జ్ చేస్తే, మరో 28 రోజులకు అదే ప్లాన్‌ను ఫ్రీగా పొందవచ్చు. దీంతో మొత్తం సర్వీస్ వ్యాలిడిటీ 56 రోజులకు పెరుగుతుంది.
ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి రూ.349 ప్లాన్ కంటే రూ.399 ప్లాన్ బెటర్ కావచ్చు. అయితే రీఛార్జ్ చేసే ముందు ప్రతి నంబర్‌కు చూపిస్తున్న ప్లాన్ వివరాలను, అదనపు ప్రయోజనాలను చెక్ చేసుకోవడం ముఖ్యం.
ఈ 1+1 ఆఫర్ కేవలం ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. దీన్ని పొందాలంటే ముందుగా మీ ఫోన్‌లో Airtel Thanks యాప్‌ను ఓపెన్ చేసి మీ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీపెయిడ్ రీఛార్జ్ సెక్షన్‌కి వెళ్లి రూ.349 లేదా రూ.399 ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఆ ప్లాన్ పక్కన '1+1 రీఛార్జ్ ఫ్రీ' అనే నోటిఫికేషన్ ఉందో లేదో చూడాలి. ఆ నోటిఫికేషన్ ఉంటేనే మీ నంబర్‌కు ఈ ఆఫర్ ఉన్నట్లు అర్థం. నోటిఫికేషన్ లేకపోతే, ప్రస్తుతానికి మీ నంబర్‌కు ఆఫర్ లేదని అర్థం. వేరే నంబర్‌కు ఆఫర్ ఉందని మీ నంబర్‌కు కూడా ఉంటుందని అనుకోవద్దు. పైగా ఈ ఆఫర్‌ను వాడుకోవాలంటే Airtel Thanks యాప్ ద్వారానే రీఛార్జ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.