Air Purifiers: 10 నిమిషాల్లో గాలిని శుభ్రం చేసే టాప్ 5 ఎయిర్ ప్యూరిఫైయర్లు

Published : Nov 09, 2026, 05:51 PM IST

Air Purifiers: మన దేశంలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. అడవులు నరికేయడం వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. అందువల్ల స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమైపోయింది. అందుకే మన ఇళ్లకు సరిపోయే బెస్ట్ 5 ఎయిర్ ప్యూరిఫైయర్లు చూసేయండి. ఫీచర్ల గురించి తెలుసుకోండి

PREV
16
బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ మోడల్స్ ఇవే

కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లో నివసించే వారికి ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్లు అత్యంత అవసరమైన వస్తువుగా మారిపోయాయి. మీ ఇంటి వాతావరణం, ఆరోగ్య అవసరాలు, కాలుష్య స్థాయిని బట్టి సరైన ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం మంచి పెట్టుబడి.

డైసన్ (Dyson), ఫిలిప్స్ (Philips), షియోమీ (Xiaomi) లాంటి టాప్ కంపెనీలు వేర్వేరు బడ్జెట్లలో బెస్ట్ మోడల్స్ తీసుకొచ్చాయి. ఫిల్టరేషన్, గాలి వేగం, శబ్దం, పోర్టబిలిటీ, ఫిల్టర్ మార్చే ఖర్చు ఆధారంగా బెస్ట్ 5 ఎయిర్ ప్యూరిఫైయర్ల లిస్ట్, వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.

26
డైసన్ ప్యూరిఫైయర్ Purifier Cool PC2 De-Nox

ప్రీమియం ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.

ఫిల్టరేషన్ టెక్నాలజీ - ఇందులో HEPA H13 క్వాలిటీతో కూడిన 3-లేయర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంది. K-కార్బన్ ఫిల్టర్ ద్వారా ఇది 50% అదనపు నైట్రోజన్ డయాక్సైడ్ (NO2) ను పీల్చుకుంటుంది. అలాగే 99.95% కాలుష్య కణాలను, దుమ్మును తొలగిస్తుంది.

కీలక ఫీచర్లు - 'ఎయిర్ మల్టిప్లయర్' టెక్నాలజీతో సెకనుకు 290 లీటర్ల గాలిని బయటకు వదులుతుంది. 350-డిగ్రీల ఆసిలేషన్, ఎల్‌సీడీ స్క్రీన్, MyDyson యాప్ ద్వారా గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

బరువు & మోడ్స్ - 4.9 కిలోల బరువు ఉండే ఇందులో 10 స్పీడ్ కంట్రోల్స్, ఆటో మోడ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి. ధర - రూ. 54,900.

36
మిజియా Smart Air Purifier 6

పెద్ద గదులకు, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. కవరేజ్ - 940 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదులకు ఇది పర్ఫెక్ట్. దీని CADR (క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్) గంటకు 443 క్యూబిక్ మీటర్లు.

సెన్సార్లు - ఉష్ణోగ్రత, తేమ, దుమ్ము, PM1, PM2.5 స్థాయిలను ట్రాక్ చేయడానికి ఇందులో 5 స్మార్ట్ సెన్సార్లు ఉన్నాయి. దీనికి అలర్జెన్-ఫ్రీ సర్టిఫికేషన్ కూడా ఉంది.

స్మార్ట్ ఫీచర్లు - దీన్ని Xiaomi Home, Xiaomi HyperOS Connect, Google Home, Alexa కు కనెక్ట్ చేసుకోవచ్చు. 40W పవర్ తీసుకునే ఇందులో సైలెంట్ 'స్లీప్ మోడ్' కూడా ఉంది. ధర - రూ. 17,999.

46
ప్రాన్ హైవ్ ఇండోర్ ప్యూరిఫైయర్

ఇది లేటెస్ట్ టెక్నాలజీ, మెడికల్-గ్రేడ్ ఫిల్టర్ ఫీచర్లతో వచ్చే బెస్ట్ మోడల్.

ఫిల్టరేషన్ - ఇందులో మెడికల్-గ్రేడ్ HEPA H14 ఫిల్టర్ ఉంది. ఇది 0.015 మైక్రాన్ల సైజున్న కాలుష్య కణాలను, అలర్జీలను 99.99% వరకు క్లీన్ చేస్తుంది.

డిజైన్ & కవరేజ్ - ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం బాడీతో 'స్పేస్ గ్రే' ఫినిషింగ్‌లో దీన్ని తయారు చేశారు. ఇది 350 చదరపు అడుగుల వరకు కవర్ చేస్తుంది.

సెన్సార్లు - PM2.5, VOCs, కార్బన్ డయాక్సైడ్, టెంపరేచర్, తేమ, చుట్టుపక్కల శబ్దాన్ని కొలిచే రియల్ టైమ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఈ డేటాను OLED స్క్రీన్, మొబైల్ యాప్‌లో చూడొచ్చు. బరువు & ధర - దీని బరువు 15 కిలోలు. ధర రూ. 64,512.

56
వోజోయో Pure Air PA1

తక్కువ బడ్జెట్‌లో చిన్న గదుల కోసం చూసేవారికి ఇదొక బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్.

ఫిల్టరేషన్ - ఆఫీస్ గదులు, చిన్న బెడ్‌రూమ్‌లకు ఇది బాగా సెట్ అవుతుంది. ఇందులో ప్రీ-ఫిల్టర్, యాంటీ-బాక్టీరియల్ లేయర్, H13 HEPA ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కలిగిన 4-లేయర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంది.

పనితీరు - ఇది PM2.5, PM10, పొగ, దుమ్ము, పెంపుడు జంతువుల వెండ్రుకలను 99.99% తొలగిస్తుంది. 404 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని క్లీన్ చేస్తుంది (CADR: 110 m³/h).

అదనపు ఫీచర్లు - 3 ఫ్యాన్ స్పీడ్ లెవల్స్, 22dB సైలెంట్ ఆపరేషన్, ఆటో షట్-ఆఫ్ టైమర్, చైల్డ్ సేఫ్టీ లాక్, నైట్ లైట్, అరోమాథెరపీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫిల్టర్ లైఫ్ 9,000 గంటల వరకు వస్తుంది. ధర - రూ. 3,999.

66
ఫిలిప్స్ ప్యూరిఫైయర్ AC1711

మీడియం సైజు గదులకు వేగంగా, నమ్మకమైన ప్యూరిఫికేషన్ అందించే మోడల్ ఇది.

ఫిల్టరేషన్ & స్పీడ్ - 3-లేయర్ HEPA నానోప్రొటెక్ట్ ఫిల్టర్ ద్వారా ఇది 0.003 మైక్రాన్ల సైజున్న కాలుష్య కణాలను 99.97% తొలగిస్తుంది. 90 చదరపు అడుగుల మీడియం రూమ్‌ను కేవలం 10 నిమిషాల్లోనే క్లీన్ చేస్తుంది (CADR: 300 m³/h).

శబ్దం & పవర్ - ఇది సైలెంట్ సెట్టింగ్‌లో 15 dB శబ్దంతో, మాగ్జిమమ్ స్పీడ్‌లో 50 dB శబ్దంతో పనిచేస్తుంది. కరెంట్ వాడకం కేవలం 27W మాత్రమే.

సెన్సార్ - AeraSense సెన్సార్ సాయంతో PM2.5 లెవల్స్, కలర్-కోడెడ్ లైట్ ద్వారా గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు చూపిస్తుంది. దీని బరువు 3.78 కిలోలు. ధర - మార్కెట్లో మీడియం బడ్జెట్‌లో దొరికే బెస్ట్ ఫిలిప్స్ మోడల్స్‌లో ఇదొకటి. దీని ధర రూ. 14,995.

Read more Photos on
click me!

Recommended Stories