AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. చివరికి హోం వర్క్ కోసం కూడా పిల్లలు చాట్ జీపీటీని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. ఏఐ అతి వినియోగం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మన రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. చదువు, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, సమాచారం వెతకడం… అన్నింటికీ ఒక క్లిక్‌తో AI వాడేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఏంటంటే.. అవసరానికి మించి AI వాడితే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది.
25
యువతలో పెరుగుతున్న AI ఆధారపడే స్వభావం
ప్రస్తుతం యువత ఎక్కువగా AI టూల్స్‌పై ఆధారపడుతోంది. కొందరు అయితే ఒంటరితనం తగ్గించుకోవడానికి కూడా AIతో మాట్లాడుతున్నారు. పరీక్షలకు సిద్ధం కావడం, ఆఫీస్ పనులు పూర్తి చేయడం, చిన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడం వంటి వాటిలో AI ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది ఉపయోగకరమే అయినా, ప్రతిదానికీ AI మీదే ఆధారపడటం ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
35
AI వాడకం మెదడుపై ఎలా ప్రభావం చూపుతోంది?
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇందులో భాగంగా 18–19 ఏళ్ల వయసు గల 54 మంది యువతపై ఒక ప్రయోగం చేశారు. వారిని మూడు గ్రూపులుగా విభజించారు.
* ఒక గ్రూప్‌కు ChatGPT వాడి వ్యాసం రాయమన్నారు
* మరో గ్రూప్‌కు Google AI సహాయంతో రాయమన్నారు
* మూడో గ్రూప్‌కు పూర్తిగా స్వయంగా రాయమన్నారు
ఈ సమయంలో EEG హెడ్‌సెట్‌తో మెదడు కార్యకలాపాలను గమనించారు.
ఫలితాలు చూసి పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు. ChatGPT వాడిన వారి మెదడులో చురుకుదనం చాలా తక్కువగా కనిపించింది. వారి వ్యాసాల్లో భావోద్వేగం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. Google AI వాడినవారిలో కొంచెం మెరుగైన మెదడు చలనం కనిపించింది. స్వయంగా ఆలోచించి రాసిన వారి మెదడు అత్యంత చురుకుగా పనిచేసింది. వారి రచనల్లో ఆలోచనల లోతు, భావం స్పష్టంగా కనిపించిందని ఉపాధ్యాయులు తెలిపారు.
55
AI మీద ఎక్కువ ఆధారపడితే వచ్చే నష్టాలు
పరిశోధనల ప్రకారం, AI టూల్స్‌ను ఎక్కువగా వాడేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మెదడు స్వయంగా ఆలోచించే సామర్థ్యం తగ్గుతోంది. ముఖ్యంగా చిన్న వయసులోనే AI మీద ఆధారపడితే, మెదడు అభివృద్ధి సరిగ్గా జరగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి AIని అవసరానికి మాత్రమే వాడాలి. పూర్తిగా దానిపైనే ఆధారపడితే మన ఆలోచన శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది.