7 రోజుల బ్యాటరీ.. వాటర్ ప్రూఫ్ డిజైన్.. ఇంత తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ వాచ్.. లుక్ కూడా సూపర్..

First Published | Sep 27, 2023, 1:19 PM IST

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నాయిస్  సరికొత్త స్మార్ట్‌వాచ్  ColorFit Icon 2ని ఇండియాలో  లాంచ్ చేసింది. ఈ  డివైజ్ తో 7 రోజుల బ్యాటరీ లైఫ్, 60 కంటే పైగా  మోడ్స్,  150 కంటే పైగా వాచ్ ఫెసెస్ వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర 2000 రూపాయల కంటే తక్కువ. ఈ ధరలో   ఈ స్మార్ట్‌వాచ్  సరైన అప్షన్ కాదా అనేది ఇప్పుడు చూద్దాం... దీనికి  1.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. మీరు ఈ డివైజ్ ని రూ.1,999 ధరకి  కొనవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ వాటర్-రెసిస్టెంట్ డిజైన్ ఇంకా హార్ట్ రేట్ సెన్సార్‌తో కూడిన SpO2 మానిటర్‌తో వస్తుంది.
 

దీని  గురించి వివరంగా  చెప్పాలంటే మీకు రూ.1,999కే  మార్కెట్లో అందుబాటులో ఉంది.  Flipkart.in అండ్  gonoise.com వంటి ఆన్‌లైన్‌ సైట్స్ లో కొనుగోలు చేయవచ్చు. కలర్‌ఫిట్ ఐకాన్ 2 రెండు కలర్ అప్షన్స్ లో వస్తుంది - ఎలైట్ బ్లాక్ అండ్  ఎలైట్ సిల్వర్.
 

నాయిస్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్  కి 1.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే  ఉంది. దీని రిజల్యూషన్ 368x448 పిక్సెల్స్. ఈ స్మార్ట్ వాచ్ AI వాయిస్ అసిస్టెంట్,  Siri, Google అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్  చేస్తుంది. నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ సపోర్ట్ కూడా అందించారు.
 


ఈ స్మార్ట్‌వాచ్ నుండి నేరుగా కాల్స్ చేయవచ్చు, రిసీవ్ చేయవచ్చు. ఈ డివైజ్ లో ఇంటర్నల్ స్పీకర్,  మైక్రోఫోన్ ఉంది. అంతే  కాకుండా 10 కాంటాక్ట్‌ నంబర్లను సేవ్ చేసుకునే అవకాశం కూడా  ఉంది.
 

హార్ట్ బీట్  రేటు, SpO2, స్లీపింగ్ ట్రాకర్, స్ట్రెస్  మొదలైన వాటిని పర్యవేక్షించడానికి నాయిస్ హెల్త్ సూట్ ఇందులో  ఉంది. ఇంకా NoiseFit Icon 2 స్మార్ట్‌వాచ్ 60+ స్పోర్ట్స్ మోడ్‌లు అండ్ 150+ వాచ్ ఫేస్‌లతో వస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్‌కి IP68 రేటింగ్ ఇచ్చారు. నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

Latest Videos

click me!