16 జీబీ ర్యామ్.. 50 ఎంపీ కెమెరా.. 15వేల కంటే తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్..!

ఇండియన్ టెక్నాలజీ కంపెనీ లావా (Lava) కస్టమర్ల కోసం Lava Blaze Pro 5Gని లాంచ్ చేసింది. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు రెడీగా  ఉంటే, మీ బడ్జెట్ రూ.15,000 వరకు అయితే  ఖచ్చితంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఓ లుక్కేయండి. లావా కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.13,000 కంటే తక్కువ ధరకే  విడుదలైంది.
 

16 GB RAM.. 50 MP Camera.. 5G smartphone launched by Lava at a budget price-sak

ప్రాసెసర్ - బ్లేజ్ ప్రో 5G ఫోన్‌ను లావా డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌తో లాంచ్ చేసింది. 

డిస్ ప్లే - లావా బ్లేజ్ ప్రో 5G 6.78 IPS LCD స్క్రీన్‌తో వస్తుంది. ఫోన్ కి 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ డిస్‌ప్లే  ఉంది. 

ర్యామ్ అండ్  స్టోరేజ్ - లావా బ్లేజ్ ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 8GB RAMతో వస్తుంది.
 

16 GB RAM.. 50 MP Camera.. 5G smartphone launched by Lava at a budget price-sak

ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా  ఉంది. అంతే కాకుండా, ఫోన్ 128 GB స్టోరేజ్‌తో కూడా వస్తుంది. 

కెమెరా - Lava Blaze Pro 5G 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.


బ్యాటరీ - Lava Blaze Pro 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. 

కలర్స్  - లావా బ్లేజ్ ప్రో 5G స్టార్రీ నైట్ అండ్ రేడియంట్ పెర్ల్ కలర్స్ లో అందుబాటులో ఉంది. 

ఆపరేటింగ్ సిస్టమ్ – లావా  కొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13పై రన్  అవుతుంది. ఫోన్ డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్‌తో వస్తుంది.

ఇండియాలో Lava Blaze Pro 5G స్మార్ట్‌ఫోన్ రూ. 12,499  వద్ద విడుదల చేసారు. అక్టోబర్ 3 నుంచి అమెజాన్ ద్వారా  అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా, ఫోన్‌ను లావా అఫీషియల్ వెబ్‌సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

vuukle one pixel image
click me!