ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా: ఫీచర్లు, ధర, పనితీరులో ఏది కింగ్ ?

Published : Sep 12, 2025, 04:20 PM IST

iPhone 17 Pro Max vs Samsung Galaxy S25 Ultra: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాప్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లుగా గుర్తింపు పొందాయి. స్పెసిఫికేషన్లు, ధరలు, ఫీచర్లు పోల్చితే ఏ ఫోన్ ముందంజలో ఉందో తెలుసుకుందాం.

PREV
17
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా : ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ల మధ్య బిగ్ ఫైట్

iPhone 17 Pro Max vs Samsung Galaxy S25 Ultra: ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్ మధ్య పోటీ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది. అయితే, ఈ రెండు కంపెనీలు తాజాగా ఆపిల్ ఐఫోన్ 17 ఫ్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) ను విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ కింగ్ గా కొనసాగుతున్న శాంసంగ్ గెలక్సీ ఎస్25 అల్ట్రా (Galaxy S25 Ultra) తో పోలిక తప్పనిసరి అయింది. ధర, డిజైన్, ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ.. ఇలా అన్ని కోణాల్లో ఈ రెండు ఫోన్ల సత్తా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

27
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా: డిజైన్, డిస్‌ప్లే.. స్టైల్ vs బ్రైట్‌నెస్

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) యూనిబాడీ డిజైన్‌తో వస్తోంది. వెనుక భాగంలో కొత్త రెక్టాంగులర్ ఫుల్ వైడ్ కెమెరా డిజైన్ ఉంది. సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్, IP68 రేటింగ్ ఉన్నాయి. 163.4×78×8.75mm పరిమాణం, 231 గ్రాములు బరువు ఉంది.

6.9 అంగుళాల సూపర్ రెటినా (Super Retina XDR OLED) స్క్రీన్, 120Hz ప్రో మోషన్, 1,600 నిట్స్ బ్రైట్‌నెస్, హెచ్డీఆర్, ట్రూ టోన్, డైనమిక్ ఐస్లాండ్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలక్సీ ఎస్25 అల్ట్రా (Galaxy S25 Ultra) IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 (Gorilla Glass Victus 2) ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. 162.8×77.6×8.2mm పరిమాణం, 218 గ్రాముల బరువును కలిగి ఉంది.

6.9 అంగుళాల Dynamic AMOLED 2X స్క్రీన్, 1Hz నుంచి 120Hz వరకు refresh rate, 2,600 nits పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

37
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా: ప్రాసెసర్, పనితీరు ఎలా ఉంది?

ఈ రెండు ఫోన్లు టాప్ ప్రాసెసర్లు ఆపిల్ A19 Pro vs Snapdragon 8 Elite లను కలిగి ఉన్నాయి.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) కొత్త A19 Pro చిప్‌తో వస్తోంది. గత మోడళ్లతో పోలిస్తే 40% మెరుగైన పనితీరును అందిస్తుంది. 12GB RAM, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్ వుండటం ప్లస్ పాయింట్. Vapour Chamber కూలింగ్, iOS 26 తో లాంచ్ అయింది.

శాంసంగ్ గెలక్సీ ఎస్25 అల్ట్రా (Galaxy S25 Ultra) స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite for Galaxy SoC) ప్రాసెసర్ ను కలిగి ఉంది. 12GB RAM, 1TB వరకు స్టోరేజ్ సపోర్టు కలిగి ఉంది. 40% పెద్ద vapour cooling chamber తో మెరుగైన పనితీరును అందిస్తుంది. ఆండ్రాయిడ్ (Android) 15 ఆధారిత One UI 7తో వస్తోంది. 7 ఏళ్ల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ కంపెనీ వెల్లడించింది.

47
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా: కెమెరా ఫీచర్లు

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) 48MP ప్రైమరీ, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫోటో లెన్స్ ను కలిగి ఉంది. 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్టు ఉంది. ముందు భాగంలో 18MP సెల్ఫీ కెమెరా, Retina Flash, Centre Stage ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలక్సీ ఎస్25 అల్ట్రా (Galaxy S25 Ultra) లో 200MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 50MP 5x టెలిఫోటో, 10MP 3x టెలిఫోటో లెన్స్ సెటప్ ఉంది. UHD 8K వీడియో రికార్డింగ్ సపోర్టు చేస్తుంది. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది.

57
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా: బ్యాటరీ వివరాలు

ఐఫోన్ 71 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max).. ఆపిల్ ప్రకారం ఇప్పటివరకు లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఐఫోన్ ఇదే. 37 గంటల వీడియో ప్లేబ్యాక్, 33 గంటల స్ట్రీమింగ్ వీడియో చేయవచ్చు. 40W ఫాస్ట్ చార్జింగ్ ద్వారా 20 నిమిషాల్లో 50% చార్జ్ చేయవచ్చు. MagSafe ద్వారా 30 నిమిషాల్లో 50% చార్జ్ అవుతుంది.

శాంసంగ్ గెలక్సీ ఎస్ 25 అల్ట్రా (Galaxy S25 Ultra) 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. అలాగే, వైర్ లెస్ పవర్ షేర్ (Wireless PowerShare) సపోర్ట్ కూడా ఉంది.

67
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా: ధరలు ఎలా ఉన్నాయి?

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) భారత్‌లో బేస్ వేరియంట్ 256GB ధర ₹1,49,900గా ఉంది. 512GB ధర ₹1,69,900. 1TB వేరియంట్ ₹1,89,900, 2TB వేరియంట్ ₹2,29,900గా ఉంది. Cosmic Orange, Deep Blue, Silver కలర్స్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలక్సీ ఎస్25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra) 256GB వేరియంట్ ధర ₹1,29,999గా ఉంది. 512GB ధర ₹1,41,999 గా, 1TB వేరియంట్ ₹1,65,999 గా ఉంది. Titanium Silverblue, Grey, Whitesilver, Black కలర్స్‌లో అందుబాటులో ఉంది.

77
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్‌ ఎస్25 అల్ట్రా: ఏది తోపు?

ధర విషయంలో టాప్ ఫీచర్లు, స్పెక్స్ తో  శాంసంగ్ గెలక్సీ ఎస్25 అల్ట్రా (Galaxy S25 Ultra) కొంత చవకగా లభిస్తోంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్, కెమెరా రిజల్యూషన్ విషయంలో శాంసంగ్ ముందంజలో ఉంది. అయితే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) సాఫ్ట్‌వేర్, చిప్‌సెట్, దీర్ఘకాలిక బ్యాటరీ పనితీరు విషయంలో ప్రత్యేకతను నిలుపుకుంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories