Internet Trends: భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కోట్లాది మంది ప్రతి రోజు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. అయితే భారతీయులు ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఏమి చూస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా.?
ఇంటర్నెట్ అంటే గూగుల్ అనే స్థాయిలో భారతీయుల అలవాటు కొనసాగుతోంది. ఏ సమాచారం కావాలన్నా, ఏ వెబ్‌సైట్‌కు వెళ్లాలన్నా, కొత్త విషయం తెలుసుకోవాలన్నా మొదటి ఎంపిక గూగుల్‌నే. అందుకే భారతీయులు అత్యధికంగా సందర్శించే ప్లాట్‌ఫామ్‌లలో గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది.
26
వీడియోల క్రేజ్ తగ్గలేదు
భారతీయులకు వీడియో కంటెంట్ అంటే ఎంత ఇష్టమో ఈ జాబితా మరోసారి నిరూపించింది. యూట్యూబ్ రెండో స్థానంలో నిలవగా, ఇన్‌స్టాగ్రామ్ మూడో స్థానంలో ఉంది. వినోదం, విద్య, వార్తలు, షార్ట్ వీడియోలు ఇలా అన్ని రకాల కంటెంట్ కోసం ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలోనే గడుపుతోంది.
36
వాట్సాప్ లేకుండా రోజు పూర్తి కాదు
నాలుగో స్థానంలో నిలిచిన వాట్సాప్ ఇప్పుడు కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగ సంబంధిత కమ్యూనికేషన్ అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఉదయం శుభాకాంక్షల నుంచి ఆఫీస్ మీటింగ్ సమాచారం వరకు వాట్సాప్ భారతీయుల జీవితంలో విడదీయరాని భాగమైంది.
ఈ జాబితాలో అత్యంత ఆసక్తికర విషయం చాట్‌జీపీటీ ఐదో స్థానంలో నిలవడం. కొద్ది కాలంలోనే ఈ AI టూల్ భారతీయుల్లో విపరీతమైన ఆదరణ పొందింది. చదువులు, ఉద్యోగం, కంటెంట్ రైటింగ్, కోడింగ్, వ్యాపార అవసరాలు వంటి అనేక రంగాల్లో చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు. ఇది భారతీయులు కొత్త టెక్నాలజీలను వేగంగా స్వీకరిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
56
క్రికెట్, షాపింగ్, కెరీర్ ప్లాట్‌ఫారమ్‌లకూ భారీ ఆదరణ
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణను క్రిక్‌బజ్ స్థానం మరోసారి చాటిచెప్పింది. లైవ్ స్కోర్లు, మ్యాచ్ అప్‌డేట్స్ కోసం లక్షలాది మంది ఈ ప్లాట్‌ఫారమ్‌ను సందర్శిస్తున్నారు. అలాగే అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు కూడా టాప్ జాబితాలో చోటు సంపాదించాయి. మరోవైపు ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా ప్రజాదరణ కొనసాగిస్తున్నాయి. వినోదంతో పాటు కెరీర్, వ్యాపారం, సామాజిక అంశాలపై కూడా భారతీయులు ఆసక్తి చూపుతున్నారని ఈ జాబితా చెబుతోంది.
66
మారుతున్న డిజిటల్ భారత్
ఈ టాప్-10 జాబితాను పరిశీలిస్తే భారతీయులు ఇప్పుడు కేవలం వినోదానికి మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగించడం లేదని స్పష్టమవుతోంది. AI, టెక్నాలజీ, ఆన్‌లైన్ షాపింగ్, కెరీర్ అభివృద్ధి, సమాచారం సేకరణ వంటి అనేక అవసరాల కోసం ఇంటర్నెట్‌ను సమర్థంగా వినియోగిస్తున్నారు. డిజిటల్ భారత్ వేగంగా మారుతున్న తీరు ఈ జాబితాలో స్పష్టంగా కనిపిస్తోంది.