Jio: జియో బిగ్ సర్ ప్రైజ్.. కేవలం రూ. 15కే అన్‌లిమిటెడ్ 5G డేటా

Published : Nov 05, 2026, 11:27 AM IST

Jio Rs 15 Unlimited 5G Plan: జియో రూ. 15 కే 24 గంటల అన్‌లిమిటెడ్ 5G డేటా ప్యాక్ లాంచ్ చేసింది. 4K స్ట్రీమింగ్, గేమింగ్ కోసం మైజియో యాప్‌లో ఈ రీఛార్జ్ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
రూ. 15 కే రోజంతా అన్‌లిమిటెడ్ 5G బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్.. జియో యూజర్లకు పండగే

టెలికాం ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేయడంలో రిలయన్స్ జియో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. యూజర్ల మనసు గ్రహించి సరికొత్త ప్లాన్స్‌తో అలరించే జియో, తాజాగా తన 5G కస్టమర్ల కోసం మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ప్రతిరోజూ ఎక్కువ డేటా వాడే వారి కోసం, హడావుడిగా పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారి కోసం కేవలం రూ. 15 కే ట్రూలీ అన్‌లిమిటెడ్ 5G డేటా ప్యాక్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు, ప్రయోజనాలు గమనిస్తే..

26
కేవలం రూ. 15 తో 24 గంటల రోజంతా అన్‌లిమిటెడ్ 5G డేటా

సాధారణంగా డేటా ప్యాక్స్ అంటే ఒక నిర్దిష్ట లిమిట్ అంటే ఉదాహరణకు 1GB లేదా 2GB ఇస్తుంటారు. కానీ జియో తీసుకొచ్చిన ఈ కొత్త రూ. 15 ప్యాక్ అలా కాదు. ఇది లిమిట్స్ లేని ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్యాక్. అంటే మీరు 24 గంటల వ్యాలిడిటీతో ఎంత డేటా అయినా వాడుకోవచ్చు. ఒక్కసారి ఈ రీఛార్జ్ చేసుకుంటే 24 గంటల పాటు హై-స్పీడ్ 5G ఇంటర్నెట్ నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది. ఎక్కువ డబ్బులు పెట్టి ఖరీదైన ప్లాన్స్ తీసుకోకుండా, తాత్కాలికంగా ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ పాకెట్ ఫ్రెండ్లీ ఆప్షన్.

36
4K స్ట్రీమింగ్ నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు.. ఈ ప్యాక్ దేని కోసం?

ఒక్క రోజులో ఎక్కువ ఇంటర్నెట్ వాడకం ఉన్నవారికి ఈ ప్యాక్ ఒక వరం లాంటిది.

• 4K వీడియో స్ట్రీమింగ్ అండ్ లైవ్ స్పోర్ట్స్: బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ 4K వీడియోలు, లైవ్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేయవచ్చు.

• ఆన్‌లైన్ గేమింగ్: మల్టీప్లేయర్ గేమింగ్, లాగ్-ఫ్రీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది.

• లార్జ్ ఫైల్స్, గేమింగ్ అప్‌డేట్స్: పెద్ద సైజ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, మూవీస్, హెచ్‌డీ వీడియాలు లేదా గేమ్స్ క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

• క్లౌడ్ బ్యాకప్: మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, వర్క్ ఫోల్డర్లను క్లౌడ్ స్టోరేజ్‌లోకి వెంటనే అప్‌లోడ్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు.

46
హాట్‌స్పాట్ కనెక్టివిటీ: వర్క్ ఫ్రమ్ హోమ్‌కి యూజ్

ఈ ప్లాన్ కేవలం మొబైల్‌కే పరిమితం కాదు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఇంట్లో వై-ఫై లేనప్పుడు మీ ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి డివైజ్‌లను మొబైల్ వై-ఫై హాట్‌స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ వర్క్ చేయడం, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనడం లేదా ఆఫీస్ ఫైల్స్ షేర్ చేయడం వంటి పనులను ఈ డేటా ప్యాక్‌తో సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

56
ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?

ఈ సూపర్ ఆఫర్‌ను పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి.

1. కస్టమర్ వద్ద తప్పనిసరిగా 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి.

2. యూజర్ జియో ట్రూ 5G నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి.

3. అలాగే యూజర్ ప్రస్తుత బేస్ ప్లాన్ అర్హతను బట్టి కూడా ఈ 5G ఆఫర్ వర్తిస్తుందని జియో తెలిపింది.

66
రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

ఈ ప్యాక్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలో లైవ్‌లోకి వచ్చింది. యూజర్లు తమకు అనుకూలమైన విధానంలో రీఛార్జ్ చేసుకోవచ్చు..

• మైజియో యాప్, Jio.com వెబ్‌సైట్.

• రిలయన్స్ రిటైల్, జనరల్ ట్రేడ్ రీఛార్జ్ అవుట్‌లెట్లు.

• థర్డ్-పార్టీ ఆన్‌లైన్ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు.

• జియో ఎంటర్‌ప్రైజ్ వెబ్‌సైట్.

తక్కువ ధరలో అపరిమిత ఇంటర్నెట్ కావలసిన వారికి ఈ రూ. 15 ప్లాన్ అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories