Poco C71: రూ. 6 వేలలో ఇలాంటి ఫీచర్లు ఎంటి భయ్యా.. తడి చేతులతో కూడా ఆపరేట్‌ చేయొచ్చు.

Narender VaitlaPublished : Apr 7, 2025 6:25 PM

మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్‌ సందడి చేస్తోంది. మారిన టెక్నాలజీకి అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. పోకో సీ71 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

14
Poco C71: రూ. 6 వేలలో ఇలాంటి ఫీచర్లు ఎంటి భయ్యా.. తడి చేతులతో కూడా ఆపరేట్‌ చేయొచ్చు.
POCO C71

బడ్జెట్‌లో ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ పోకో. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి పోకో సీ71 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ. 6500కే ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అధికారికంగా లాంచ్‌ కాగా ఈ ఫోన్‌ అమ్మకాలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని రిటైల్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ లభించనుంది. 

ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 8999కాగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా 27 శాతం డిస్కౌంట్‌తో రూ. 6499కే లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఈ లెక్కన ఈ ఫోన్‌ను రూ. 6 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సి వస్తుందని అనుకునేరు. తక్కువ ధరలో కూడా అదిరిపోయే ఫీచర్లను ఇందులో అందించారు. 
 

24
Poco C71

ఫీచర్ల విషయానికొస్తే పోకో సీ71 స్మార్ట్‌ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్లో 6.88 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను అందించనున్నారు. ఈ స్క్రీన్‌ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వాటర్‌ డ్రాప్‌ నాచ్‌తో తీసుకొచ్చారు. తడి చేతులతో కూడా ఆపరేట్‌ చేసుకునేందుకు వీలుగా ఈ ఫోన్‌లో స్క్రీన్‌ వెట్‌ టచ్‌ ఫీచర్‌ను అందించారు. ఈ ఫోన్‌ యూనిసోనిక్‌ T7250 SoC చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో మెమోరీని ఎస్డీ కార్డు సహాయంతో 2 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

34
Poco smartphone

TUVలో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సర్కాడియన్ సర్టిఫికేషన్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ స్క్రీన్‌ కంటిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను డెసర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ వంటి కలర్స్‌లో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్‌ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. 

44
Poco smartphone

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IP52 రేటింగ్‌ను ఇచ్చారు. ఏప్రిల్‌ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో సేల్ ప్రారంభం కానుంది. 

Read more Photos on
click me!