India develops sixth generation stealth fighter jets: భారత్ 6వ తరం స్టెల్త్ యుద్ధవిమానాల అభివృద్ధిలోకి అడుగుపెట్టింది. AMCA ప్రాజెక్టుతో ఏఈఎఫ్‌కు అత్యాధునిక శక్తిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
6th జెన్ స్టెల్త్ ఫైటర్ జెట్ : భారత AMCA ప్రాజెక్టు ప్రారంభం
చైనా తన ఐదో తరం స్టెల్త్ జె-20 యుద్ధవిమానాలను భారత్ సరిహద్దుల్లో మోహరించిన నేపథ్యంతో పాటు పాకిస్థాన్ అటువంటి ఆధునిక విమానాలను పొందే అవకాశాల మధ్య, భారత వైమానిక దళం (IAF) అత్యాధునిక టెక్నాలజీతో కూడిన యుద్ధవిమానాల అవసరం మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో, భారత్ కీలకమైన అడుగు వేసింది. డీఆర్డీవో (DRDO) ఆధ్వర్యంలో 6వ తరం స్టెల్త్ యుద్ధవిమానాల అభివృద్ధికి ప్రారంభమైన AMCA (Advanced Medium Combat Aircraft) ప్రాజెక్టు, భారత వైమానిక శక్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఉంది.
25
రెండు కొత్త మోడళ్ల అభివృద్ధి: మార్క్-1, మార్క్-2
ఈ ప్రాజెక్టులో రెండు వేరియంట్లు ఉంటాయి. AMCA మార్క్-1, మార్క్-2. మార్క్-1 తాత్కాలిక అవసరాలను తీర్చేందుకు రూపొందించనున్నారు. ఇది అమెరికా జెనరల్ ఎలక్ట్రిక్ (GE) కంపెనీ తయారు చేసిన F414 ఇంజిన్‌తో నడుస్తుంది. అయితే సరఫరాలో జాప్యం కారణంగా డెలివరీలు ఏడాది పాటు ఆలస్యం అయ్యాయి.
మార్క్-2 మాత్రం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు అవుతుంది. దీనికి GTRE (Gas Turbine Research Establishment) అభివృద్ధి చేసే 120 కిలో న్యూటన్ శక్తిగల ఇంజిన్ ఉపయోగిస్తారు. ఈ ఇంజిన్ తయారీకి Rolls-Royce, Safran, General Electric వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి.
35
భారత్‌కు 200–300 యుద్ధవిమానాల అవసరం
ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) వద్ద కేవలం 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉండగా, అవసరమైన సంఖ్య 42-43 స్క్వాడ్రన్లుగా ఉంది. అంటే భారత్‌కు అదనంగా 200 నుంచి 300 వరకు యుద్ధవిమానాలు అవసరం. AMCA ప్రాజెక్టు ద్వారా ఈ లోటును తీర్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
AMCA మార్క్-2లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ వ్యవస్థలు ఉండే అవకాశం ఉంది. ఇవి తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ విమానాలు మానవుడు లేకుండానే మిషన్లు నిర్వహించగలిగే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. పైలట్ UAVలను ఒకేసారి నియంత్రించవచ్చు.
55
ప్రపంచ దేశాలకు దడపుట్టించేందుకు సిద్ధమవుతున్న భారత్
ఈ ప్రాజెక్టుతో భారత్, యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా వంటి 6వ తరం యుద్ధవిమానాలను అభివృద్ధి చేస్తున్న అగ్రరాజ్యాల జాబితాలో చేరనుంది. AMCA ద్వారా భారత్ వైమానిక రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది.