ఇలాగైతే దొంగనోట్లను ఈజీగా గుర్తించవచ్చు... ఏమిటీ టైమ్-గేటెడ్ విజిబిలిటీ?

Published : May 23, 2025, 11:38 AM ISTUpdated : May 23, 2025, 02:00 PM IST

టైమ్-గేటెడ్ విజిబిలిటీ ఫీచర్‌ను ఉపయోగించి తయారు చేసిన ఇంక్‌లతో పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లు, హై సెక్యూరిటీ డాక్యుమెంట్లపై రహస్య ట్యాగ్లు, గుర్తింపు కోడ్‌లు ముద్రించవచ్చు. తద్వారా దొంగనోట్లను ఈజీగా గుర్తించవచ్చు.

PREV
15
కైరల్ అమినోబోరేన్ అణువు రూపకల్పన

దొంగనోట్లు, నకిలీ డాక్యుమెంట్లు వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ఓ విప్లవాత్మక టెక్నాలజీని అభివృద్ధి చేసింది. బెంగళూరులోని ఐఐఎస్సీకి చెందిన అణు భౌతిక రసాయన శాఖ (IPC) పరిశోధకులు తయారు చేసిన కొత్త కైరల్ అమినోబోరేన్ అణువులు ప్రత్యేకమైన విజువల్ భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ అణువులు ఒకే సమయంలో ఫాస్ఫోరెసెన్స్ (చీకట్లో ప్రకాశించడం), సర్క్యులర్లీ పోలరైజ్డ్ ల్యూమినసెన్స్ (CPL) అనే రెండు అరుదైన లక్షణాలను కలిగి ఉండటం విశేషం.

25
టైమ్-గేటెడ్ విజిబిలిటీ అంటే ఏమిటి?

“టైమ్-గేటెడ్ విజిబిలిటీ” అనేది ఒక రహస్య సందేశం. కేవలం కాంతి ఉన్నపుడు ఒకలా, కాంతి ఆగిన తర్వాత మరోలా కనిపించే విధానం. ఉదాహరణకు, యూవి కాంతిలో ఒక కోడ్ “1180”గా కనిపిస్తే, కాంతిని ఆపగానే అదే ప్రదేశంలో “IISc” అనే పదం చీకట్లో వెలుగుతూ ప్రత్యక్షమవుతుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించి తయారు చేసిన ఇంక్‌లతో పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లు, హై సెక్యూరిటీ డాక్యుమెంట్లపై రహస్య ట్యాగ్లు, గుర్తింపు కోడ్‌లు ముద్రించవచ్చు. ఇవి కేవలం నిర్ణీత కాంతి క్రమంలో మాత్రమే కనిపిస్తాయి. అంటే అవి దొంగల కళ్లకు దొరక్కుండా, అవసరమైన వారికి మాత్రమే సమాచారం అందుతుంది.

35
దీని ఉపయోగం

మెటల్-ఫ్రీ, పర్యావరణానికి హానికరం లేని పదార్థం

తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే ఫాస్ఫోరెంట్ ఇంక్‌లు

బయోఇమేజింగ్, డిస్‌ప్లే టెక్నాలజీ, డేటా ఎన్‌క్రిప్షన్ వంటి రంగాల్లో వాడకానికి అనుకూలం

రూమ్ టెంపరేచర్లో పనిచేసే దీర్ఘకాలిక ప్రకాశ సామర్థ్యం

45
ఎక్కడెక్కడ వినియోగించవచ్చు

ఈ కొత్త అణువులు యాంటీ-కౌంటర్‌ఫిటింగ్ టెక్నాలజీలో గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఐఐఎస్సీ ప్రకటించిన ప్రకారం, ఈ పదార్థాలను కింది వాటి కోసం ఉపయోగిస్తారు. 

  • దొంగనోట్ల నిర్ధారణకు
  • అత్యవసర సమాచారం రహస్యంగా చేరవేసే ట్యాగ్‌లుగా
  • బయోమెడికల్ ఇమేజింగ్‌లో — కణాల ఉనికిని గుర్తించేందుకు
  • అధునాతన డిస్‌ప్లే ప్యానెళ్లు లేదా సెన్‌సింగ్ వ్యవస్థల్లో వినియోగించవచ్చని వివరించారు.
55
గేమ్ చేంజర్ కానుందా?

ఈ పరిశోధనను ప్రముఖ సైన్స్ జర్నల్ కమ్యూనికేషన్స్ కెమిస్ట్రీ ప్రచురించింది. ఐఐఎస్సీ ప్రొఫెసర్ పీ. తిలగర్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం భవిష్యత్తులో భద్రతా టెక్నాలజీకి చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

“మనం అభివృద్ధి చేసిన అణువులు ఫాస్ఫోరెన్స్ మరియు సిపిఎల్ లక్షణాలను కలిగి ఉండటం సరికొత్త అడుగు. స్ట్రక్చరల్ గట్టితనం, బహుళ ప్రకాశ లక్షణాలను సమన్వయంగా తెచ్చేందుకు ఇది మార్గదర్శకంగా మారుతుంది” అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన తిలక్ తెలిపారు.

ఈ కొత్త అణువులు సమయాన్ని ఆధారంగా తీసుకుని ప్రకాశించే లక్షణంతో, దొంగనోట్ల నిర్ధారణ, డేటా భద్రత, బయోఇమేజింగ్ మొదలైన అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి చూపిస్తున్నాయి. భారత శాస్త్రవేత్తల చేతుల్లో నుంచి వచ్చిన ఈ సాంకేతిక విజయం భద్రతా రంగంలో గ్లోబల్ స్టాండర్డ్స్‌ను మెరుగుపరిచే దిశగా ఒక పెద్ద అడుగు అని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories