మీ ఫోన్‌లో కూడా డైల‌ర్ స్క్రీన్ మారిందా.? న‌చ్చ‌క‌పోతే ఏం చేయాలో తెలుసా.?

Published : Aug 23, 2025, 02:51 PM IST

చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్‌ల‌లో ఒక మార్పు క‌నిపించింది. నిజానికి ఇది ఆటోమెటిక్‌గా అప్డేట్ అయ్యింది. ఇంత‌కీ ఏంటా అప్డేట్‌.? అది న‌చ్చ‌క‌పోతే ఎలా మార్చుకోవాలి.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మారిన డైల‌ర్ స్క్రీన్

చాలా మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల ఫోన్‌ల‌లో ఇంట‌ర్‌ఫేజ్ ఒక్క‌సారిగా మారింది. ఫోన్‌లో కాల్, డయలర్ స్క్రీన్ మారిపోవడం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎలాంటి అప్డేట్, నోటిఫికేషన్ లేకుండానే ఈ మార్పు రావడానికి కారణం గూగుల్‌ తీసుకొచ్చిన మెటీరియ‌ల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్. ఇది దశల వారీగా అన్ని ఫోన్‌ల‌లోకి వ‌చ్చేస్తోంది.

25
ఏం మారింది.?

హోమ్ ట్యాబ్

ఇప్పుడిక ఫేవరెట్స్‌, రీసెంట్స్‌ అన్నీ ఒకే ట్యాబ్‌లో కనిపిస్తాయి. టాప్ కాంటాక్ట్స్‌ని కారసెల్‌ ఫార్మాట్‌లో చూపించడం వల్ల ఒక టచ్‌తోనే కాల్ చేయొచ్చు.

కీ ప్యాడ్ డిజైన్

పాత ఫ్లోటింగ్ బటన్‌ స్థానంలో, కొత్తగా రౌండెడ్‌ డిజైన్‌తో కీ ప్యాడ్‌ ఇప్పుడు ప్రత్యేక ట్యాబ్‌గా కనిపిస్తుంది.

35
కాంటాక్ట్స్ నావిగేషన్

సెర్చ్ ఫీల్డ్‌ నుంచి నావిగేషన్ డ్రాయర్‌ ద్వారా Contacts, Settings, Call History, Help అన్నీ సులభంగా యాక్సెస్ చేయొచ్చు.

ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్

ఇక కాల్ రిసీవ్ చేయడానికి లేదా కట్ చేయడానికి హారిజాంటల్ స్వైప్ లేదా సింగిల్ ట్యాప్ ఆప్షన్‌ వాడొచ్చు. ఇది Settings > Incoming Call Gesture లో మార్చుకునే వీలుంది.

45
ఇన్-కాల్ ఇంటర్‌ఫేస్

కాల్‌లో ఉన్నప్పుడు బటన్లు ఇప్పుడు పిల్-షేప్ లో ఉంటాయి. ఏ బటన్‌ ప్రెస్ చేస్తే అది పెద్దగా కనిపిస్తుంది. ముఖ్యంగా End Call బటన్‌ పెద్దదిగా చేసి మరింత సులభం చేశారు.

55
న‌చ్చ‌క‌పోతే ఏం చేయాలి..?

అయితే కొంద‌రికి ఈ అప్డేట్ న‌చ్చ‌డం లేదు. అప్ప‌టి వ‌ర‌కు ఉప‌యోగించిన ఫార్మ‌ట్ కాకుండా కొత్త‌ది క‌నిపించ‌డంతో చాలా మంది క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ అప్డేట్ న‌చ్చ‌క‌పోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

* ఆ త‌ర్వాత యాప్స్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోండి. అనంత‌రం మ్యానేజ్ యాప్స్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

* సెర్చ్ ఆప్ష‌న్‌లో ఫోన్ అని టైప్ చేసి ఎంట‌ర్ నొక్కాలి.

* త‌ర్వాత ఫోన్‌ను సెల‌క్ట్ చేసుకొని ఫోర్స్ స్టాప్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

* అనంత‌రం క్యాచీ మెమోరీని క్లియ‌ర్ చేయాలి.

* చివ‌రిగా అన్ ఇన్‌స్టాల్ అప్డేట్స్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అంతే మీ డైల‌ర్ వ‌చ్చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories