Published : Aug 10, 2025, 09:59 AM ISTUpdated : Aug 10, 2025, 10:00 AM IST
WhatsApp Collage Feature: వాట్సాప్‌లో కొత్తగా కొలేజ్ ఫీచర్ వచ్చింది. స్టేటస్ కోసం యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం వచ్చింది. ఒకేసారి ఆరు ఫోటోలు లేఔట్‌లో అమర్చుకుని స్టేటస్‌గా పెట్టుకోవచ్చు, థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు.
WhatsApp Collage Feature:వాట్సాప్ స్టేటస్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఎప్పుడూ స్టేటస్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు పెట్టే వారికి వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇకపై ఫోటోలు ఎడిట్ చేయడానికి లేదా థర్డ్ పార్టీ యాప్స్ తో అవసరం లేకుండా చేసింది. యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, స్టేటస్ అప్‌డేట్ చేయడం మరింత ఈజీగా మారింది. వాట్సాప్ న్యూ స్టేటస్ ఫీచర్ వివరాలు మీ కోసం..
25
"వాట్సప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్ – ఒకేసారి ఆరు ఫోటోలు స్టేటస్‌లో!"
వాట్సప్ వినియోగదారులకు ఇది నిజంగా గుడ్ న్యూసే.. ఇప్పటివరకు ఒక్క స్టేటస్‌లో ఎక్కువ ఫోటోలు పెట్టాలంటే ఎడిటింగ్ యాప్స్ సహాయం తప్పనిసరి అయ్యేది. ఒక్కొక్కదాన్ని విడిగా అప్‌డేట్ చేయడం లేదా థర్డ్ పార్టీ యాప్‌ల సహాయం తీసుకుని ఫోటోలను కలిపి పెట్టుకోవాల్సి వచ్చేది.
ఇప్పుడు ఆ అవసరం లేకుండా యాప్‌లోనే ఫోటోలను ఎంపిక చేసి కొలేజ్ లేఅవుట్‌గా మార్చే బిల్ట్-ఇన్ ఎడిటర్‌ను వాట్సప్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో ఒకేసారి ఆరు ఫోటోలను స్టేటస్‌గా పెట్టుకోవచ్చు, అంటే పుట్టినరోజు పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ట్రిప్ లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలన్నీ ఒకే స్టేటస్‌లో చూపించుకోవచ్చు. అదీ మీకు నచ్చిన లేఅవుట్‌లో స్టేటస్ పెట్టుకోవచ్చు.
35
లేఔట్ ఆప్షన్ ఎలా వాడాలి?
వాట్సప్‌లో లేఔట్ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. మొదట, వాట్సప్ యాప్‌లో “Status” సెక్షన్‌కి వెళ్లి “My Status”పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఫోనులోని గ్యాలరీ నుంచి ఒకేసారి ఆరు ఫోటోలు వరకు ఎంపిక చేసుకోవచ్చు. ఫోటోలు ఎంచుకున్న వెంటనే స్క్రీన్‌లో “Layout” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకుంటే, మీరు అనేక రకాల కొలాజ్ స్టైల్స్‌లో ఫోటోలను అమర్చుకోవచ్చు. లేఔట్ సెట్ చేసిన తరువాత, మీ స్టేటస్‌ను మరింత ఆకర్షణీయంగా చేయాలంటే మ్యూజిక్, స్టిక్కర్లు, టెక్స్ట్ వంటి ఇతర ఎడిటింగ్ టూల్స్ కూడా ఉపయోగించవచ్చు. అంతిమంగా, ఈ అన్ని ఎడిటింగ్ పూర్తి చేసుకుని “Send” బటన్ నొక్కితే చాలు. స్టేటస్ రెడీ.
వాట్సప్ ఈ కొత్త అప్డేట్ దశలవారీగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే కొంతమంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది, మిగిలిన వారికి త్వరలో అప్‌డేట్ రూపంలో అందజేయనుంది. ఈ లేఔట్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్ స్టిక్కర్స్, ఫోటో స్టిక్కర్స్ వంటి మరో రెండు కొత్త ఆప్షన్లు కూడా త్వరలో యాప్‌లో చేరబోతున్నాయి, ఇవి స్టేటస్‌కు న్యూ లుక్ ను ఇవ్వడానికి సహాయపడతాయి.
55
క్రియేటర్లకి ఉపయోగకరం
డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, స్టోరీలు క్రియేటివ్‌గా పెట్టేవారికి ఈ లేఔట్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పుట్టినరోజులు, ఈవెంట్‌లు, ట్రిప్ ఫోటోలను ఒకేసారి సులభంగా పంచుకోవాలనుకునే వారికి ఇది సమయాన్ని చాలా ఆదా చేస్తుంది. వాట్సప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపర్చడమే ఈ మార్పుల లక్ష్యం. ఇప్పుడు వాట్సప్‌లోనే ఈ ఫీచర్ రావడంతో ఎటువంటి అదనపు యాప్ అవసరం ఉండదు. ఇలా కంటెంట్ క్రియేటర్లకు మరింత క్రియేటివ్ స్టోరీస్ రూపొందించడానికి సహాయపడుతుంది.