రూ. 12 వేలకే 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదండోయ్‌..

First Published | Jan 16, 2025, 11:18 AM IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ 'గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌' పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 13వ తేదీన మొదలైన ఈ సేల్‌ 19వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో మంచి డీల్స్‌ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా వీడబ్ల్యూ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది.. 
 

అమెజాన్‌ గ్రేట్ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే వీడబ్ల్యూ టీవీపై మంచి ఆఫర్‌ లభిస్తోంది. సాధారణంగా 43 ఇంచెస్‌ టీవీ కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కువ రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సేల్‌లో భాగంగా 43 ఇంచెస్‌ టీవీని కేవలం రూ. 12 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ ఈ టీవీని ఎలా సొంతం చేసుకోవాలి.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వీడబ్ల్యూ 43 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 23,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 44 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 13,499కి పొందొచ్చు. అయితే బ్యాంక్‌ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ లెక్కన ఈ టీవీని రూ. 12 వేలకే సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ లేని వారు అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే రూ. 400 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. 
 


ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1920*1080 పిక్సెల్స్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. 178 డిగ్రీల వ్యూయింగ్‌ యాంగిల్‌ను అందించారు. ఐపీఈ టెక్నాలజీ, ఎకో విజన్‌, సినిమా మోడ్‌, సినిమా జూమ్‌తో పాటు ఈ స్క్రీన్‌ 16.7 మిలియన్‌ కలర్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 
 

ఇక ఈ టీవీల క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ టీవీ లైనెక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మిరాకాస్ట్‌తో ఫోన్‌ను టీవీకి కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ టీవీ ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, జీ5, ప్లెక్స్, యప్‌టీవీ, ఈరోస్‌ నౌ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ విషయానికొస్తే ఈ టీవీలో రెండు హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, ఆప్టికల్‌ అవుట్ పుట్‌, వైఫై, LAN వంటి ఫీచర్లను అందించారు. సౌండ్‌ పరంగా చూస్తే ఇందులో 24 వాట్స్‌ అవుట్‌పుట్‌, స్టీరియో సరౌండ్‌, 5 సౌండ్ మోడ్స్‌ను ఇచ్చారు. 
 

Latest Videos

click me!