25 నిమిషాల్లో హైదరాబాద్‌ టూ విజయవాడ.. 'హైపర్‌లూప్‌'తో సాధ్యమే

First Published | Jan 10, 2025, 2:56 PM IST

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది. తక్కువలో తక్కు బస్సులో అయితే 5 నుంచి 6 గంటలు, ఒకవేళ కారు అయితే నాన్‌ స్టాప్‌గా వెళితే మహా అయితే 4 గంటలైనా పడుతుంది కదూ! అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం కేవలం 25 నిమిషాలే అవుతుంది. ఇంతకీ ఏంటా టెక్నాలజీ అంటే.. 
 

హైదరాబాద్ నుంచి విజయవాడ ఒకవేళ విమానంలో వెళ్లినా కనీసం గంట సమయం పడుతుంది. అయితే కేవలం 25 నిమిషాల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకుంటే ఎలా ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు కేవలం 15 నిమిషాల్లోనే వెళితే..

ఏంటి రాకెట్‌లో వెళ్తే సాధ్యమే అని అనుకుంటారా.? అయితే త్వరలోనే భూమిపై ప్రయాణించే ఇలాంటి వాహనం అందుబాటులోకి రానుందని మీకు తెలుసా.? హైపర్‌ లూప్‌ టెక్నాలజీ పేరుతో శరవేగంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం హైపర్‌లూప్‌ ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా ఈ రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఓ రేంజ్‌లో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సరికొత్త టెక్నాలజీలో వాహనం వాక్యూం రూపంలో ఉండే గొట్టాల్లో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దానిపై ఏరోడైనమిక్‌ ప్రభావం పడదు. అంటే బయటి నుంచి ఎలాంటి ప్రభావం పడదు. 

దీంతో రైలు అత్యంతా వేగంగా దూసుకెళ్తుంది అనేది ఈ హైపర్‌ లూప్‌ టెక్నాలజీ ఉద్దేశం. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే గంటకు 1200 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చని చెబుతున్నారు. గాలి పీడనం అత్యంత తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి వాహనాన్ని ప్రవేశ పెడితే ఆ వాహనం అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. 
 


ఐఐటీ మద్రాస్‌.. 

హైపర్‌ లూప్‌ టెక్నాలజీపై ఐఐటీ మద్రాస్‌కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు గత పదేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వీళ్లు ట్యూబ్‌ను తయారు చేశారు. ట్యూబ్ లోలప గాలిలేకుండా చేసి మాగ్నెటిక్‌ లెవిటేషన్‌ టెక్నాలజీ ద్వారా వాహనాన్ని వేగంగా పరుగులు తీసేలా పరిశోధనలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఐఐటీ మద్రాస్‌, భారత్‌ రైల్వేలతో పాటు ఇరత స్టార్టప్స్‌ కలిసి తొలి హైపర్‌లూప్‌ టెస్ట్‌ ట్రాక్‌ సిద్ధం చేశారు. 410 మీటర్ల ట్రాక్‌ను రూపొందించారు. 
 

ఎలాన్‌ మస్క్‌ సైతం.. 

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సైతం హైపర్‌ లూప్‌ టెక్నాలజీ కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో గ్లోబల్‌ హైపర్‌లూప్‌ పోటీలను సైతం నిర్వహించాడు. ఈ పోటీలో పాల్గొన్న ఐఐటీ మద్రాస్‌ టీమ్‌ మంచి పేరు సంపాదించుకుంది.

దీంతో ఈ హైపర్‌ లూప్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేందుకు మరెంత సమయం పట్టకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రవాణా రంగం రూపు రేఖలు మారడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 
 

Latest Videos

click me!