ZIM vs AUS : సికిందర్ రజా దెబ్బ.. ఆస్ట్రేలియా అబ్బా ! వరల్డ్ కప్‌లో బిగ్గెస్ట్ అప్‌సెట్ ఇదే !

Published : Feb 13, 2026, 03:49 PM IST

Zimbabwe vs Australia: 2026 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో గెలిచి, 2007 నాటి చరిత్రాత్మక విజయాన్ని గుర్తు చేస్తూ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.

PREV
16
T20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. చరిత్రను రిపీట్ చేస్తూ సంచలన విజయం

కంగారూల గర్వం అణచేశారు.. జింబాబ్వే సింహాల్లా గర్జించాయి.. టీ20 వరల్డ్ కప్ 2026లో పెను భూకంపం.. పసికూన అనుకుంటే పాతాళానికి తొక్కేశారు. 17 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు ఎలాంటి గాయం చేశారో.. సరిగ్గా అదే సీన్ కొలంబో గ్రౌండ్‌లో రిపీట్ అయింది. వరల్డ్ ఫేవరెట్ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టి, 170 పరుగుల టార్గెట్‌తో కంగారూల అబ్బా అనిపించారు. 23 పరుగుల తేడాతో జింబాబ్వే సృష్టించిన ఈ సంచలనం చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. అండర్‌డాగ్స్ అంటే తక్కువ అంచనా వేస్తే.. ఆట ఎలా ఉంటుందో చూపించిన పక్కా మాస్ విక్టరీ ఇది..

పసికూనగా భావించే జింబాబ్వే జట్టు, బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ విజయంతో జింబాబ్వే తన సూపర్-8 ఆశలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా, క్రికెట్ ప్రపంచంలో అత్యంత పెద్ద అప్‌సెట్‌లలో ఒకటిగా నిలిచింది. 2007 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తీరును గుర్తుచేస్తూ, జింబాబ్వే మరోసారి చరిత్రను తిరగరాసింది. మొత్తంగా తమ ఆటతో జింబాబ్వే కంగారులను కంగరెత్తించింది.

26
తొలుత బ్యాటింగ్‌లో మెరిసిన జింబాబ్వే

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో కంగారూలు విఫలమయ్యారు. జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆయన 56 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన ర్యాన్ బర్ల్ 35 పరుగులతో రాణించగా, చివర్లో కెప్టెన్ సికిందర్ రజా మెరుపులు మెరిపించారు. రజా కేవలం 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో, జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

36
తడబడిన ఆస్ట్రేలియా బ్యాటర్లు

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జింబాబ్వే బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం జట్టుపై స్పష్టంగా కనిపించింది. జింబాబ్వే బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టారు. ఆసీస్ బ్యాటర్లు ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

46
మ్యాట్ రెన్షా పోరాటం వృథా

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాట్ రెన్షా ఒక్కడే ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆయన 44 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టులో ఆశలు రేకెత్తించాడు. అయితే అతనికి అవతలి వైపు నుంచి సరైన సపోర్టు లభించలేదు. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. ముజరబానీ 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. బ్రాడ్ ఈవాన్స్ కూడా 3 వికెట్లతో రాణించడంతో ఆస్ట్రేలియా 146 పరుగులకే పరిమితమై, 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

56
2007 నాటి చరిత్రాత్మక జ్ఞాపకాలు

ఈ విజయం 2007 టీ20 ప్రపంచకప్‌ను గుర్తుకు తెస్తోంది. అప్పట్లో రికీ పాంటింగ్ నేతృత్వంలోని అత్యంత శక్తివంతమైన ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ రోజు బ్రెండన్ టేలర్ హీరోగా నిలిస్తే, నేడు బ్రయాన్ బెన్నెట్, ముజరబానీ ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇది రెండో విజయం. ఇది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

66
అండర్‌డాగ్స్ ఎంట్రీ.. అదిరిపోయింది !

ప్రస్తుత ప్రపంచకప్‌లో చిన్న జట్లు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా చేతిలో పాకిస్థాన్, నమీబియా చేతిలో శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ గతంలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. నిన్ననే ఇటలీ జట్టు నేపాల్‌ను ఓడించి చరిత్ర సృష్టించగా, నేడు జింబాబ్వే ఏకంగా ఆస్ట్రేలియానే ఓడించింది. ఈ టోర్నీలో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేమని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాబోయే మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories