Yash Dayal: పోక్సో కేసులో ఇరుక్కున్న ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జైపూర్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్‌కు యశ్ దయాల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ యశ్ దయాల్ టోర్నీకి దూరమయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోక్సో కేసులో ఇరుక్కున్న దయాల్.. ఇటీవల అతడి బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించడంతో అరెస్ట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.
25
రెండు వేర్వేరు ఫిర్యాదులు..
ఒక మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని యశ్ దయాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మరో 17 ఏళ్ల బాలిక కూడా తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపించింది. దీంతో యశ్ దయాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో అతడు ముందస్తు బెయిల్ కోసం చేసిన అప్పీల్‌ను జైపూర్‌లోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో త్వరలోనే యశ్ దయాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
35
అందుబాటులో ఉండదని అనుమానాలు..
ఈ పరిణామాల నేపధ్యంలో యశ్ దయాల్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్లేయర్‌ను ఆడించడం సరైనది కాదని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. యశ్ దయాల్ స్థానంలో భారత సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ను తీసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
యశ్ దయాల్ విషయంలో మరికొద్ది రోజుల్లో రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ యశ్ దయాల్ అరెస్టు అయితే, ముందే చెప్పినట్లుగా ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.
55
ఆర్సీబీ తరపున అరంగేట్రం..
ఉమేష్ యాదవ్ గతంలో ఆర్సీబీ తరపున ఆడాడు. 2018 నుంచి 2020 సీజన్ వరకు మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018 సీజన్‌లో 20 వికెట్లు తీయగా.. 2019 సీజన్‌లో కేవలం ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక 2020లో గాయం కారణంగా రెండు మ్యాచ్‌లు ఆడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసినా, ఉమేష్ యాదవ్‌కు పెద్దగా అవకాశాలు లభించలేదు. అంతేకాకుండా, 2025 సీజన్‌లో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు.