IPL 2026 : జైలర్ దెబ్బ.. సీఎస్‌కేకు కోటి రూపాయల షాక్.. ధోని భాయ్ ఇప్పుడెలా !

Published : Mar 14, 2026, 07:50 PM IST

IPL 2026 CSK : ఐపీఎల్ 2026 ప్రచారాల్లో రజనీకాంత్ సినిమాల సంగీతాన్ని వాడబోమని చెన్నై సూపర్ కింగ్స్ మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. సన్ టీవీ నెట్‌వర్క్ దాఖలు చేసిన రూ. 1 కోటి కాపీరైట్ ఉల్లంఘన కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

PREV
16
తలైవా పాట వాడుకున్నందుకు తలపట్టుకున్న సీఎస్‌కే

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్ ప్రచార కార్యక్రమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల పాటలు లేదా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడబోమని ఆ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టులో జరిగిన కాపీరైట్ వివాదమే దీనికి ప్రధాన కారణం.

26
సన్ టీవీ, సీఎస్‌కే మధ్య ఏం జరిగింది?

సన్ టీవీ నెట్‌వర్క్ చెన్నై సూపర్ కింగ్స్‌పై మద్రాస్ హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగింది. తమ అనుమతి లేకుండా రజనీకాంత్ నటించిన చిత్రాల సంగీతాన్ని, డైలాగులను సీఎస్‌కే ప్రమోషన్లలో వాడుకున్నారని సన్ టీవీ ఆరోపించింది. ఈ మేరకు కాపీరైట్ ఉల్లంఘన కింద పిటిషన్ దాఖలు చేసింది. తగిన లైసెన్సులు లేకుండా వాణిజ్య పరంగా తమ కంటెంట్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

36
ఏయే పాటలపై వివాదం చెలరేగింది?

సన్ పిక్చర్స్ నిర్మించిన రజనీకాంత్ సినిమాలైన జైలర్, జైలర్ 2, కూలీ చిత్రాల్లోని పాటలను సీఎస్‌కే తన సోషల్ మీడియాలో వాడింది. ముఖ్యంగా కూలీ సినిమాలోని హార్బర్ గ్యాంగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన జైలర్ మ్యూజిక్ ట్రాక్‌లను వాడినట్లు సన్ టీవీ గుర్తించింది. ఈ కాపీరైట్ ఉల్లంఘన జరిగినందుకు గానూ రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

46
ప్రమోషన్లలో పాటల వినియోగం

ఐపీఎల్ 2026 కోసం విడుదల చేసిన కొత్త జెర్సీ లాంచ్ వీడియోలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాకను రజనీకాంత్ సినిమా పాటలతో ఎలివేట్ చేశారు. తమిళనాడులో రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను వాడుకుని, మర్చండైజ్ అమ్మకాలను పెంచుకోవడానికి సీఎస్‌కే ప్రయత్నించిందని సన్ టీవీ ఆరోపించింది. సోషల్ మీడియాలో భారీ వ్యూస్ రావడానికి ఈ సంగీతమే కారణమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

56
కోర్టులో సీఎస్‌కే ఏం చెప్పిందంటే?

ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో కొన్ని సందర్భాల్లో రజనీకాంత్ సినిమాల సంగీతాన్ని వాడిన మాట నిజమేనని సీఎస్‌కే అంగీకరించింది. అయితే, ఇకపై కాపీరైట్ హోల్డర్ల అనుమతి లేకుండా అటువంటి కంటెంట్‌ను వాడబోమని కోర్టుకు హామీ ఇచ్చింది. ఇప్పటికే వివాదాస్పద వీడియోలను తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించామని సీఎస్‌కే తరపు న్యాయవాదులు తెలిపారు.

66
తర్వాత ఏం చేయనుంది?

మద్రాస్ హైకోర్టు సీఎస్‌కే ఇచ్చిన హామీని రికార్డు చేసింది. దీనిపై అధికారికంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఫ్రాంచైజీని ఆదేశించింది. ఐపీఎల్ జట్లు గతంలోనూ ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. 2016లో ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ISRA) కూడా రాయల్టీ చెల్లించకుండా బాలీవుడ్ పాటలు ప్లే చేస్తున్నారని బీసీసీఐ, ఐపీఎల్ జట్లపై కోర్టుకు వెళ్ళింది. తాజా కేసు క్రీడా ఫ్రాంచైజీలు సినిమా కంటెంట్‌ను వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories