జైస్వాల్‌కు రాజస్థాన్ షాక్.. కెప్టెన్సీ కోసం మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే

Published : Jan 02, 2026, 07:32 PM IST

Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీపై చర్చ కొనసాగుతోంది. ఐపీఎల్ 2026 వేలం తర్వాత జట్టు సమతుల్యంగా ఉన్నా, సారథి ఎవరనేది ప్రశ్నార్థకమే. రాబిన్ ఉతప్ప సూచనల ప్రకారం రియాన్ పరాగ్ లేదా రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉండగా.. 

PREV
15
సంజూను తప్పించారు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026కు సంబంధించిన వేలం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. వేలం ప్రారంభం కాకముందే రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన విషయం తెలిసిందే.

25
10 మంది ఫాస్ట్ బౌలర్లు..

రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగాన్ని ప్రశంసించిన అతడు, జట్టులో 10 మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, అనేక బౌలింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాడు. స్పిన్ విభాగంలో రవి బిష్టోయ్, రవీంద్ర జడేజా వంటి టాప్ స్పిన్నర్లు ఉండగా, బ్యాటింగ్ విభాగంలో షిమ్రాన్ హెట్మెయర్, డెనోవన్ ఫెర్రీరా, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ లాంటి ఆటగాళ్లతో బలంగా ఉందని వివరించాడు.

35
బౌలర్లు ఎక్కువ..

మినీ వేలం తర్వాత రవీంద్ర జడేజా, శామ్ కర్రన్, రవి బిష్టోయ్ లాంటి ప్రముఖ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని రాజస్థాన్ బలమైన జట్టును ఏర్పాటు చేసింది. అయితే, ఈ బలమైన జట్టుకు సారథి ఎవరనే ప్రశ్న ఇప్పటికీ ఓ ప్రశ్నగానే ఉంది. ఈ కెప్టెన్సీ సందిగ్ధతపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయాలను వెల్లడించాడు.

45
కెప్టెన్సీ విషయంలోనే సందిగ్దత

ప్రస్తుతం రాజస్థాన్ జట్టు సమతుల్యంగా కనిపిస్తున్నప్పటికీ, కెప్టెన్సీ విషయంలోనే తనకు ప్రశ్న ఉందని ఉతప్ప స్పష్టం చేశాడు. కెప్టెన్సీ పగ్గాలు రియాన్ పరాగ్ లేదా రవీంద్ర జడేజాకు దక్కే అవకాశాలు ఉన్నాయని అతడు అభిప్రాయపడ్డాడు. యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ విషయంలో మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు అని ఊతప్ప పేర్కొన్నాడు.

55
తదుపరి కెప్టెన్‌ ఎవరు.?

స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు సమతుల్యతను ప్రశంసించాడు. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్స్, ఆల్ రౌండర్లు సహా జట్టు బలంగా ఉందని అతడు తెలిపాడు. అయితే, ఐపీఎల్ ప్రారంభానికి ముందు జోఫ్రా ఆర్చర్ లాంటి కీలక ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్ గురించి అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికే కెప్టెన్సీ గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, తదుపరి కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్ ఎవరిని నియమిస్తుందో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories