Virat Kohli: విరాట్ కోహ్లీ 2026లో మూడు కీలక మైలురాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో 9000 పరుగులు పూర్తి చేయడంతో పాటు, వన్డే క్రికెట్‌లో 15,000 పరుగులు సాధించనున్నాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం విజయవంతంగా ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్ ట్రోఫీ, భారత జట్టుతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంతో పాటు దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2026లో కోహ్లీ మూడు కీలక మైలురాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
25
టోర్నీలో ఒకే ఒక్కడు..
మొదట, ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలవడానికి కోహ్లీకి కేవలం 339 పరుగులు మాత్రమే అవసరం. ప్రస్తుతం అతను 259 ఇన్నింగ్స్‌లలో 8661 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా కోహ్లీ కొనసాగుతున్నాడు.
35
ఐపీఎల్‌లో అరుదైన రికార్డు..
కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రమే ఆడాడు. గత మూడు ఐపీఎల్ సీజన్లలో అతను ఏ సీజన్‌లోనూ 600 పరుగుల కంటే తక్కువ చేయకపోవడం విశేషం.
రెండోది, వన్డే క్రికెట్‌లో 15,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 296 ఇన్నింగ్స్‌లలో 14557 వన్డే పరుగులతో ఉన్న కోహ్లీకి 15,000 మార్కును చేరుకోవడానికి 443 పరుగులు అవసరం. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్.
55
సంగక్కరను అధిగమించే ఛాన్స్..
చివరగా, 2026లో అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం 623 ఇన్నింగ్స్‌లలో 27975 పరుగులు చేసిన కోహ్లీ, కుమార సంగక్కర(28016 పరుగులు)ను అధిగమించడానికి కేవలం 42 పరుగులు మాత్రమే దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే 2026 తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.