నీరజ్ చోప్రా - మను భాకర్ ఆస్తులు ఎన్ని? ఎవరు ఎక్కువ మెడల్స్ గెలిచారు?

First Published | Aug 18, 2024, 10:38 PM IST

Neeraj Chopra-Manu Bhaker :  పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త స్టార్ అథ్లెట్లు నీర‌జ్ చోప్రా, మ‌ను భాక‌ర్ లు భార‌త్ కు మెడ‌ల్స్ అందించారు. అయితే, ప్ర‌స్తుతం వీరిద్ద‌రి గురించి ఆస్తులు, మెడల్స్ స‌హా ప‌లు విష‌యాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

Neeraj Chopra Manu Bhaker

Neeraj Chopra-Manu Bhaker: పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్‌, జావెలిన్‌ త్రోలో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన నీరజ్‌ చోప్రాలు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త‌లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవ‌ల ఇద్ద‌రు స్టార్లు ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం, నీర‌జ్ తో మ‌ను త‌ల్లి మాట్లాడుతూ ఒట్టు వేయించుకోవ‌డంతో ఇది మొద‌లైంది. 

What is the net worth of Neeraj Chopra-Manu Bhaker? Who won more medals? Who is the richest among the two?

పెళ్లి గురించి ప్ర‌స్తావిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో వీరి ఫొటోలు షేర్‌ చేయడం ప్రారంభించారు. ఇన్ని పరిణామాల మధ్య మను భాకర్ తల్లి నీరజ్ చోప్రాను కలిసిన వీడియో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియో వైరల్ కావడంతో, మను భాకర్, ఆమె తండ్రి కూడా క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చినా అభిమానులు మాత్రం ఒలింపిక్ మెడ‌ల్స్ గెలిచిన స్టార్లు పెళ్లి చేసుకుంటే బాగుండేదన్న హింట్లను విసురుతున్నారు. మను భాకర్‌ రెండు కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో స్వర్ణంతో పాటు సిల్వ‌ర్ గెలిచి ఎంతో మంది యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచాడు నీర‌జ్ చోప్రా. 


What is the net worth of Neeraj Chopra-Manu Bhaker? Who won more medals? Who is the richest among the two?

నీరజ్ చోప్రా, మను భాకర్ ల‌లో ఎవ‌రు అత్యంత ధనవంతులు అనే చర్చలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. పతకం సాధించిన తర్వాత చాలా కంపెనీలు తమ ఉత్పత్తులకు అంబాసిడర్‌గా ఉండేందుకు మను భాకర్‌ను సంప్రదిస్తున్నాయి. నీరజ్ చోప్రా ఇప్పటికే చాలా కంపెనీలకు అంబాసిడర్‌గా ఉన్నారు. రెండోసారి పతకం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా తన బ్రాండ్ విలువను పెంచుకున్నట్లు సమాచారం. జీక్యూ నివేదిక ప్రకారం, మను భాకర్ నికర విలువ రూ.12 కోట్లు. రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్న మను భాకర్ సంపద మరింత పెరగనుంది. నీరజ్ చోప్రా మొత్తం ఆస్తులు 37 కోట్ల రూపాయలు. నీరజ్ చోప్రా అనేక బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రకటనల్లో కూడా కనిపించారు. నీరజ్ చోప్రా సంపద మను భాకర్ కంటే దాదాపు రూ.25 కోట్లు ఎక్కువ.

What is the net worth of Neeraj Chopra-Manu Bhaker? Who won more medals? Who is the richest among the two?

నీరజ్ చోప్రా ఇప్పటి వరకు 13 మెడ‌ల్స్ సాధించాడు. ఇందులో 9 బంగారు, 4 రజత పతకాలు ఉన్నాయి. అతను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. మను భాకర్ 24 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో సహా 34 పతకాలు సాధించింది.
 
 

What is the net worth of Neeraj Chopra-Manu Bhaker? Who won more medals? Who is the richest among the two?

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పెళ్లి వార్తలపై మను భాకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొన్ని కార్యక్రమాల్లో నీరజ్‌ని కలిశాను కానీ, ఇదివ‌ర‌కు మాకు ఒకరికొకరు తెలియదు. నీర‌జ్-ఆమె త‌ల్లి వైర‌ల్ వీడియో గురించి కూడా మ‌ను భాక‌ర్ మాట్లాడుతూ..  "ఆ రోజు నీరజ్ చోప్రాతో మా అమ్మ ఏం మాట్లాడిందో నాకు ఖచ్చితంగా తెలియదు. నేను అక్కడ లేను. మా అమ్మ కూడా అక్కడి క్రీడాకారులందరితో మాట్లాడింది. అయితే నీరజ్‌తో తాను మాట్లాడిన క్లిప్ వైరల్‌గా మారిందని" మను భాకర్ తెలిపారు. కాగా, మ‌ను భాక‌ర్ తండ్రి మాట్లాడుతూ.. "కూతురికి ఇంకా పెళ్లి వయసు లేదు. ఆమె ముందు ఇంకా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి ఉన్నాయంటూ ఈ వార్త వైరల్‌గా మారడంపై మను భాకర్ తండ్రి అసహనం వ్యక్తం చేస్తూ అన్నారు. 

Latest Videos

click me!