వినేష్ ఫోగ‌ట్ చనిపోతుంద‌నుకున్నా.. ఏం జ‌రిగింది.. బ‌రువు త‌గ్గింపు పై షాకింగ్ విష‌యాలు..

First Published | Aug 18, 2024, 10:02 PM IST

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఫైనల్ పోరుకు ముందు 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. అయితే, ఆమె పెరిగిన బ‌రువును త‌గ్గించే క్రమంలో ఎంత శ్ర‌మించారో వివ‌రించిన ఆమె కోచ్ వోలర్ అకోస్ సంచలన విషయాలు వెల్లడించాడు.
 

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ ఫైన‌ల్ కు చేరుకున్నారు. ఆమె పోటీ ప‌డిన 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ప్ర‌పంచ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ల‌కు సైతం షాకిచ్చి ఫైన‌ల్ కు చేరుకున్నారు. దీంతో చివ‌రి మ్యాచ్ గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా ఒక మెడ‌ల్ కు ఖాయం చేశారు. 

Vinesh Phogat

అయితే, ఏవ‌రూ ఊహించ‌ని విధంగా ఆమె కేవ‌లం 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా అన‌ర్హ‌తకు  గుర‌య్యారు. మహిళల 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించడానికి కొన్ని గంటల ముందు వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ అన‌ర్హ‌త వేటు ప‌డింది. దీంతో యావ‌త్ క్రీడాలోకం షాక్ కు గురైంది. 


Paris Olympics 2024 - vinesh phogat

ఫైన‌ల్ ఈవెంట్‌కు 1వ రోజు ముందు బ‌రువు పెరిగిన వినేష్ ఫోగ‌ట్ దానిని త‌గ్గించడానికి చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. సెమీ-ఫైనల్స్‌లో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్‌మాన్‌పై గెలిచిన తర్వాత, ఆమె రీబౌండ్‌తో బాధపడింది. ఆమె బరువు పరిమితి కంటే 2.7 కిలోలు పెరిగింది. కోచ్, పోషకాహార నిపుణుడు, టీం ఇండియా వైద్యులు వినేష్ బరువు తగ్గించుకోవడానికి తమ స్థాయికి తగ్గట్టుగా ప్రయత్నించారు, కానీ వారికి అంత స‌మ‌యం లేకుండా పోయింది. 

అయితే, వినేష్ పోగ‌ట్ బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నంలో చ‌నిపోయివుండేద‌ని భయంకరమైన విష‌యాలు వెల్ల‌డించారు వినేష్ ఫోగ‌ట్ కోచ్ వోల‌ర్ అకోస్. గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్ కు ముందు రాత్రి బరువు తగ్గడం ఎంత బాధాకరమైనద‌నే విష‌యాన్ని ఆయ‌న పంచుకున్నారు.

ప్రస్తుతం తొల‌గించిన పోస్టులో.. "సెమీ-ఫైనల్ తర్వాత 2.7 కిలోల అదనపు బరువు మిగిలి ఉంది. మేము ఒక గంట ఇరవై నిమిషాలు వ్యాయామం చేసాము, కానీ 1.5 కిలోలు ఇంకా మిగిలి ఉన్నాయి. తరువాత, 50 నిమిషాల ఆవిరి తర్వాత, ఆమెపై చెమట చుక్క కనిపించలేదని" వోలర్ అకోస్ ఫేస్‌బుక్‌లో రాశారు.

"ఏ ఎంపిక లేదు.. అర్ధరాత్రి నుండి ఉదయం 5:30 వరకు ఆమె వేర్వేరు కార్డియో మెషీన్లు, రెజ్లింగ్ కదలికలపై, రెండు మూడు నిమిషాల విశ్రాంతితో ఒకేసారి మూడు వంతుల పాటు పనిచేసింది. త‌ర్వాత ఆమె ప్రారంభించింది. ఆమె మళ్ళీ కుప్పకూలింది, కానీ మేము ఆమెను చాలా ప్ర‌య‌త్నంతో లేపాము. ఆమె ఒక గంట ఆవిరి స్నానంలో గడిపింది" అని కోచ్ చెప్పాడు. అలాగే, ఈ నాట‌కీయ వివ‌రాల‌ను పంచుకోద‌ల‌చుకోలేదు కానీ, వినేష్ ఫోగ‌ట్ చ‌నిపోతుంద‌నుకున్నాన‌ని ఆ భ‌యాన‌క విష‌యాలు ప్ర‌స్తావించారు. కాగా, గ‌తంలో 2015లో, 21 ఏళ్ల చైనీస్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్ తన పోరాటానికి ముందు రోజు బరువు తగ్గించుకునే ప్రయత్నంలో తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతూ మరణించాడు.

Latest Videos

click me!