India Vs South Africa: భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమమైంది. విశాఖపట్నంలో జరిగే ఆఖరి వన్డే డూ ఆర్ డైగా మారింది. ఈ కీలక మ్యాచ్‌కు భారత్ తుది జట్టులో మార్పులు తప్పవని అంచనా.
భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత్ గెలుపొందగా, రెండో వన్డేలో సౌతాఫ్రికా సత్తా చాటింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఆఖరి వన్డే విశాఖపట్నంలో జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం కాగా, విశాఖలో సరైన తుది జట్టుతో బరిలో దిగడమే భారత జట్టుకు సవాల్‌గా మారింది. దీంతో టీమిండియా ఫైనల్ ఎలెవన్‌లో కొన్ని మార్పులు తప్పవని అంచనాలున్నాయి. తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
25
ఆ ఇద్దరిపై వేటు..
వాషింగ్టన్ సుందర్ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో సుందర్ స్థానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. పంత్‌ను తీసుకుంటే బ్యాటింగ్ యూనిట్ బలం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. వన్డే సిరీస్‌లో ప్రసిద్ద్ కృష్ణ కూడా గొప్పగా రాణించడం లేదు. భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. దీంతో విశాఖలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ను ఆడించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నితీశ్ సేవలు జట్టుకు అడ్వాంటేజ్ అవుతాయని చర్చ జరుగుతోంది.
35
జైస్వాల్ కంబ్యాక్ ఇవ్వాలంటూ..
ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తొలి రెండు వన్డేల్లోనూ జైస్వాల్ పెద్ద స్కోర్లు సాధించలేకపోయాడు. దీంతో మూడో మ్యాచ్ యశస్వి జైస్వాల్‌కు చాలా కీలకంగా మారింది. టీం మేనేజ్‌మెంట్ కూడా జైస్వాల్ నుంచి మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది
మరోవైపు, ఓపెనర్ రోహిత్ శర్మ మంచి టచ్‌లోనే ఉన్నాడు. హిట్ మ్యాన్ ఫామ్ భారత్ జట్టుకు కలిసొచ్చే అంశం. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించి ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. విశాఖలోనూ చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు.
55
మిడిలార్డర్‌లో రుతురాజ్ కీలకం..
విశాఖలో నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నాడు. రాయ్‌పూర్ మాదిరిగా విశాఖలోనూ అతడు రఫ్ ఆడిస్తే సౌతాఫ్రికా బౌలర్లకు సవాల్ తప్పదు. కెప్టెన్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్ ఫామ్ భారత్‌కు కలిసొచ్చే అంశం. మిగిలిన బౌలర్లు కూడా తోడుంటే గెలుపు టీమిండియాదే అంటున్నారు విశ్లేషకులు