Virat Kohli : 15 ఏళ్ల తర్వాత కోహ్లీ రీఎంట్రీ.. వచ్చి రాగానే సెంచరీతో రచ్చ!

Published : Dec 24, 2025, 05:55 PM IST

Virat Kohli : విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆంధ్రపై అద్భుత సెంచరీ సాధించాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 16 వేల పరుగులు పూర్తి చేసి సచిన్ టెండూల్కర్ రికార్డు సరసన చేరాడు.

PREV
15
Virat Kohli : విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ

భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత దేశవాళీ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన ఈ రన్ మెషీన్, ఆంధ్రా జట్టుపై అద్భుతమైన సెంచరీ సాధించాడు.

దాదాపు దశాబ్దంన్నర తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నప్పటికీ, కోహ్లీ ఆటలో అదే పాత పదును కనిపించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన సెంచరీతో క్రికెట్ ఫార్మాట్ ఏదైనా తన క్లాస్ ఎప్పటికీ చెక్కుచెదరదని నిరూపించాడు.

25
84 బంతుల్లోనే కోహ్లీ విధ్వంసం

ఆంధ్రా జట్టు నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టుకు విరాట్ కోహ్లీ వెన్నముకగా నిలిచాడు. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన కోహ్లీ, క్రీజులో కుదురుకున్నాక తన గేర్ మార్చాడు. అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో అలరించిన కోహ్లీ కేవలం 84 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

మరోవైపు నితీష్ రాణాతో కలిసి కోహ్లీ నెలకొల్పిన భాగస్వామ్యం ఢిల్లీ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసింది. నితీష్ రాణా కూడా చక్కటి హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో కోహ్లీకి అండగా నిలిచాడు. ఆంధ్రా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, ఢిల్లీని విజయతీరాలకు చేర్చడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఛేజ్ మాస్టర్‌గా పేరున్న కోహ్లీ, ఒత్తిడిలోనూ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి ఢిల్లీ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచాడు.

35
లిస్ట్-ఏ క్రికెట్‌లో 16 వేల పరుగులతో కోహ్లీ

ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం సెంచరీ కొట్టడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా లిస్ట్-ఏ క్రికెట్‌లో 16,000 పరుగుల మార్కును కోహ్లీ దాటాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 1 పరుగు చేసిన వెంటనే కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. 131 పరుగుల తన ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.

లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో 16 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ చేరాడు. ఈ రికార్డు సాధించిన ప్రపంచంలోని 9వ బ్యాటర్‌గా, భారత్ నుంచి రెండో బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తాజా గణాంకాల ప్రకారం, 343 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఇప్పటివరకు 16,025 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 57 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.

45
సచిన్ టెండూల్కర్ సరసన చేరిన కోహ్లీ

లిస్ట్-ఏ క్రికెట్‌లో 16 వేల పరుగులు పూర్తి చేయడం ద్వారా విరాట్ కోహ్లీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. సచిన్ తన కెరీర్లో 551 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 21,999 పరుగులు చేశాడు. ఇందులో 60 సెంచరీలు, 114 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇప్పుడు కోహ్లీ కూడా ఆ ఎలైట్ క్లబ్‌లో చేరడంతో, భారత క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 15 ఏళ్ల తర్వాత దేశవాళీ వన్డే మ్యాచ్ ఆడుతున్నా, కోహ్లీలో ఏమాత్రం తడబాటు కనిపించకపోవడం గమనార్హం.

55
అత్యధిక పరుగుల వీరులు వీరే

లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 బ్యాటర్ల జాబితా ఇదే..

1. గ్రహమ్ గూచ్ - 22,211 పరుగులు

2. గ్రేమ్ హిక్ - 22,059 పరుగులు

3. సచిన్ టెండూల్కర్ - 21,999 పరుగులు

4. కుమార సంగక్కర - 19,456 పరుగులు

5. వివ్ రిచర్డ్స్ - 16,995 పరుగులు

6. రికీ పాంటింగ్ - 16,363 పరుగులు

7. గోర్డాన్ గ్రీనిడ్జ్ - 16,349 పరుగులు

8. సనత్ జయసూర్య - 16,128 పరుగులు

9. విరాట్ కోహ్లీ - 16,025 పరుగులు

10. అలన్ లాంబ్ - 15,658 పరుగులు

Read more Photos on
click me!

Recommended Stories