Virat Kohli ఆన్ లైన్లో విరాట్ కోహ్లీ 10వ తరగతి మార్కుల షీట్.. ఆటాడుకుంటున్న ఫ్యాన్స్!

క్రికెట్లో తిరుగులేని ఆటగాడు విరాట్ కోహ్లి. సమకాలీన ప్రపంచంలో అతడికి దగ్గరగా వచ్చే క్రికెటర్లు లేరు. తన సొగసైన ఆట, మైదానంలో దూకుడుగా ఉండే తత్వం తనని దిగ్గజంగా మార్చాయి. కానీ అతడు చదువులో మాత్రం సగటు విద్యార్థే.  అదెలాగంటారా? తాజాగా ఈ ఆర్సీబీ ఆటగాడి పదోతరగతి మార్కుల మెమో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. వైరల్ గా మారిన ఈ మార్కుల షీట్ పై అంతా చర్చించుకుంటున్నారు.

Virat kohli class 10 marksheet viral online details in telugu

విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల షీట్ వైరల్: విరాట్ కోహ్లీ అంటే ఈ తరం క్రికెట్‌కు ప్రతిరూపం. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేయని రికార్డు లేదు.  ఒక్కమాటలో చెప్పాలంటే కోహ్లీ క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత జీవితంలో చాలా ఓపెన్‌గా ఉంటాడు. అన్ని విషయాలూ అభిమానులతో పంచుకుంటాడు.

Virat kohli class 10 marksheet viral online details in telugu

కోహ్లీ X, Instagram వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్‌గా ఉంటాడు. ఫ్యామిలీతో గడిపిన, జిమ్ వర్కవుట్స్ చేసిన పిక్చర్స్, వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఇటీవల విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల షీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 2023లో కోహ్లీ తన పదో తరగతి మార్కుల షీట్‌ను 'కూ' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశాడు.


ఆ మార్కుల షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మార్కుల షీట్‌లో విరాట్ కోహ్లీ పదో తరగతి పరీక్షలో వివిధ సబ్జెక్టులలో సాధించిన మార్కులు ఉన్నాయి. నెటిజన్లు ఈ మార్కుల షీట్‌ను చాలా వేగంగా షేర్ చేస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు, ''ఓహ్! కోహ్లీకి మ్యాథ్స్‌లో ఇంత తక్కువ మార్కులా? మనలాగే!'' అని అంటున్నారు.

మళ్ళీ కొందరు, ''విరాట్ కోహ్లీకి మంచి మార్కులు రాకపోయినా, అతను అడుగుపెట్టిన రంగంలో నంబర్ 1 అయ్యాడు. అతనికి ఎక్కువ మార్కులు రాకపోయినా, అతని పట్టుదల, కష్టపడే తత్వం అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి'' అని మెచ్చుకుంటున్నారు.

అతనికి ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, మ్యాథ్స్‌లో 51, సైన్స్‌లో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇంట్రడక్షన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు వచ్చాయి. అతని టోటల్ స్కోర్ 69.8 శాతం.

Latest Videos

vuukle one pixel image
click me!