Virat Kohli: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, సంజయ్ మంజ్రేకర్ పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడన్న మంజ్రేకర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ..
టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఓటమిపాలైన నేపథ్యంలో వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్ పెట్టారు.
25
సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో..
గతంలో సంజయ్ మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ ఈజీ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడని విమర్శించారు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్ట్‌లకు వీడ్కోలు పలికాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌లో రాణిస్తుంటే, కోహ్లీ మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం నిరాశపరిచిందని ఆయన తక్కువ చేసి మాట్లాడారు.
35
అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించినా..
విరాట్ అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేదని, కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్‌కు సులువైన వన్డేలలో కొనసాగడం మరింత నిరాశకు గురి చేసిందని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వికాస్ కోహ్లీ కూడా సంజయ్ మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండా, "కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి" అని థ్రెడ్స్‌లో ఘాటుగా బదులిచ్చారు.
తాజాగా, వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో వికాస్ కోహ్లీ మరోసారి సంజయ్ మంజ్రేకర్‌పై సెటైర్లు పేల్చారు. స్టూడియోలో కూర్చుని ఏదైనా మాట్లాడటం సులువని, మైదానంలోకి దిగితేనే అసలు విషయం తెలుస్తుందని చురకలు అంటించారు. "మిస్టర్ క్రికెట్ ఎక్స్‌పర్ట్, నీ దగ్గర అత్యంత సులువైన ఫార్మాట్ గురించి ఏవైనా సూచనలు ఉన్నాయా? అయినా అవి పనిచేయాలంటే మీరు మైదానంలో ఉండాలి కదా?" అని వికాస్ కోహ్లీ ప్రశ్నించారు.
55
చెప్పడం సులభం, కానీ చేయడమే కష్టం
"ఏదేమైనా చెప్పడం సులభం, కానీ చేయడమే కష్టం" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వికాస్ కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్‌పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంజ్రేకర్‌కు సరైన జవాబు చెప్పాడని విరాట్ అభిమానులు వికాస్‌ను పొగుడుతున్నారు. ఈ పరిణామం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.