బంగ్లాదేశ్ పోతేనేం.. ఐసీసీ పక్కా స్కెచ్‌తో టీ20 ప్రపంచకప్‌లోకి పసికూన జట్టు.!

Published : Jan 22, 2026, 07:00 AM IST

ICC: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరగా, ఐసీసీ జనవరి 21ని తుది గడువుగా విధించింది. భద్రతా ఆందోళనలపై ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది.  

PREV
15
టీ20 వరల్డ్ కప్ 2026

భారత్-శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. బంగ్లాదేశ్ గత టోర్నమెంట్‌లో టాప్ 7లో నిలవడం ద్వారా ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భద్రతా ఆందోళనలను ప్రస్తావిస్తూ, భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని అభ్యర్థించింది.

25
ఐసీసీ కఠినమైన అల్టిమేటం

ఈ అభ్యర్థనపై ఐసీసీ కఠినమైన అల్టిమేటం జారీ చేసింది. భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాల్గొనాలా లేదా టోర్నీ నుంచి తప్పుకోవాలా అనే విషయంపై జనవరి 21ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోపు బంగ్లాదేశ్ భారత్‌లో ఆడటానికి అంగీకరించకపోతే, వారిని టోర్నమెంట్ నుంచి తొలగిస్తారు. ఐసీసీ తన స్వతంత్ర భద్రతా అంచనా ప్రకారం భారత్‌లో ఎలాంటి ముప్పు లేదని, షెడ్యూల్‌ను మార్చలేమని స్పష్టం చేసింది.

35
బంగ్లాదేశ్ తప్పుకుంటే

బంగ్లాదేశ్ గనుక వరల్డ్ కప్ నుంచి తప్పిస్తే, ఐసీసీ ప్రస్తుత టీ20ఐ ర్యాంకింగ్స్ ఆధారంగా రీప్లేస్‌మెంట్ జట్టును ఎంపిక చేస్తుంది. ఈ జాబితాలో స్కాట్లాండ్, బంగ్లాదేశ్ తర్వాత అత్యుత్తమ స్థానంలో ఉంది. కాబట్టి, స్కాట్లాండ్ స్థానం దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది, వారి మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో జరగాలి. బంగ్లాదేశ్ తప్పుకుంటే, స్కాట్లాండ్ అదే గ్రూప్‌లో చేరి అదే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సి ఉంటుంది.

45
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు

ఈ పరిణామాల వెనుక ఇండియా-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026కి ముందు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తమ జట్టు నుండి విడుదల చేయాలని బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను కోరింది. దీని ఫలితంగానే బీసీబీ భద్రతా కారణాలను చూపిస్తూ తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను భారతదేశం నుంచి తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. అయితే, ఈ విషయంలో జనవరి 21న తుది నిర్ణయం తీసుకోనున్నారు.

55
పాక్ మద్దతు

ఈ సందిగ్ధతలో పాకిస్తాన్ తన పాత్రను పోషిస్తోంది. బంగ్లాదేశ్ సమస్య పరిష్కారం కాకపోతే పాకిస్తాన్ తన భాగస్వామ్యాన్ని పునఃసమీక్షించుకోవచ్చని తెలుస్తోంది. భద్రతా అంశాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను సంప్రదించగా, పాకిస్తాన్ పూర్తి మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా, శ్రీలంక అందుబాటులో లేకపోతే, బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఐసీసీకి తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories