Top 5 fastest IPL centuries : ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు సాధించిన టాప్ 5 భారతీయ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. వైభవ్ నుంచి మయాంక్ అగర్వాల్ వరకు ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన ప్లేయర్ల వివరాలు మీకోసం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. ప్రతి ఏటా ఈ టోర్నీ ఎంతో మంది యువ ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం కౌంట్‌డౌన్ ఇప్పటికే మొదలైంది. అన్ని జట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలోనే బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కొత్త యజమానులు వచ్చారు. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు నమోదు చేసిన టాప్ 5 భారతీయ ఆటగాళ్ల వివరాలు గమనిస్తే..
26
1. వైభవ్ సూర్యవంశీ: నంబర్ 1 స్థానంలో యువ సంచలనం
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన భారతీయ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, గుజరాత్ టైటాన్స్‌పై అతను కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్ ఆడే సమయానికి అతని వయసు కేవలం 14 ఏళ్ల 32 రోజులు మాత్రమే. ఈ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడిగానే కాకుండా, టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన పురుష క్రికెటర్‌గా కూడా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
36
2. యూసుఫ్ పఠాన్
చాలా కాలం పాటు ఈ రికార్డు యూసుఫ్ పఠాన్ పేరిట ఉండేది. 2010లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ యూసుఫ్ పఠాన్ కేవలం 37 బంతుల్లోనే దుమ్మురేపే సెంచరీని కొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పఠాన్, ముంబై బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటిగా నిలిచింది.
ఐపీఎల్ 2025లో మరో అద్భుత ఇన్నింగ్స్ ప్రియాన్ష్ ఆర్య బ్యాట్ నుండి వచ్చింది. పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ, చెన్నై సూపర్ కింగ్స్‌పై ప్రియాన్ష్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. జట్టు ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడినప్పటికీ, ఈ యువ ఎడమచేతి వాటం బ్యాటర్ ఏమాత్రం భయం లేకుండా దూకుడుగా ఆడాడు. మొత్తం 42 బంతుల్లో 103 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.
56
4. అభిషేక్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌పై వీరవిహారం చేశాడు. 246 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 40 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ మార్కును అందుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసిన అతను, ఆ తర్వాత మరింత వేగంగా ఆడి పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. అలాగే ఐపీఎల్ చరిత్రలో భారతీయుల పరంగా ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ.
66
5. మయాంక్ అగర్వాల్
ఈ జాబితాలో ఐదో స్థానంలో మయాంక్ అగర్వాల్ నిలిచాడు. 2020 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడుతూ మయాంక్ 45 బంతుల్లో సెంచరీ బాదాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్, ఆది నుంచే అద్భుతమైన టైమింగ్‌తో షాట్లు ఆడుతూ రాజస్థాన్ బౌలర్లను ఉతికేసాడు. ఈ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఐపీఎల్‌లో భారతీయులు చేసిన టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఉంది.
ఈ ఐదుగురు ఆటగాళ్లు తమ అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాబోయే ఐపీఎల్ 2026లో ఈ రికార్డులను ఎవరైనా బద్దలు కొడతారో లేదో చూడాలి.