టోక్యో ఒలింపిక్స్: టీమిండియాకి ‘సాడ్’ డే... ఆ రెండు విజయాలు తప్ప, అన్నింట్లోనూ...

First Published Jul 31, 2021, 5:16 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో 8వ రోజు భారత జట్టుకి ఏ మాత్రం కలిసి రాలేదు. పతకం తెస్తారని భావించిన ప్లేయర్లు, కీలక మ్యాచుల్లో ఓటమి పాలై నిరాశపరిచారు. వుమెన్స్ హాకీ, డిస్క్ త్రో ఈవెంట్‌లో తప్ప... మిగిలిన అన్ని ఈవెంట్లలోనూ భారత జట్టుకి నిరాశే ఎదురుకావడం విశేషం... 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశాకిరణం, తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. సెమీ ఫైనల్‌లో చైనీస్ ప్లేయర్ తై జూ యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో ఓడింది పీవీ సింధు.
undefined
సెమీస్‌లో ఓడిన పీవీ సింధు, రేపు కాంస్య పతకం కోసం జరిగే పోరులో చైనా ప్లేయర్ హీ బింగ్ జివోతో తలబడనుంది. 2016 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన పీవీ సింధు, ఈసారి వరుసగా నాలుగు మ్యాచులను రెండు రౌండ్లలోనే ముగించి సెమీస్ చేరుకున్న విషయం తెలిసిందే.

pv sindhu

సెమీస్‌లోనూ తొలి సెట్‌‌ ఫస్ట్ హాఫ్‌లో 11-8 తేడాతో ఆధిక్యంలో నిలిచిన పీవీ సింధు, ఆ తర్వాత తై జూ జోరు ముందు నిలవలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో 16-16, 17-17 తేడాతో సమంగా నిలవడంతో ఉత్కంఠ రేగింది. 

యితే ఆ తర్వాత వరుస పాయింట్లు సాధించిన తై జూ 21-18 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో మొదటి నుంచి దూకుడు చూపించిన తై జూ, పీవీ సింధుపై పూర్తి ఆధిక్యం చూపించింది. స్మాష్ షాట్లతో సింధుకి అవకాశం లేకుండా చేసిన తై జూ, ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

pv sindhu

Sreeshankar Murali

లాంగ్ జంప్ ఈవెంట్‌లో అత్యుత్తమంగా 7.69 మీటర్లు దూకిన భారత అథ్లెట్ ఎం. శ్రీశంకర్ మురళీ తీవ్రంగా నిరాశపరిచాడు. 

సెయిలింగ్‌లో 49ఎర్స్‌లో జరిగిన ఈవెంట్‌లో పోటీపడిన వరుణ్ టక్కర్, కేసీ గణపతి 17వ ర్యాంకులో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు...

వుమన్స్ షూటింగ్‌ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఈవెంట్‌లోనూ భారత జట్టుకి నిరాశే ఎదురైంది. క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో భారత షూటర్లు అంజుమ్ మౌడ్‌గిల్ 15వ స్థానంలో, తేజస్విణీ సావత్ 33వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు.
undefined

భారత మహిళా హాకీ జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన పూల్ మ్యాచ్‌లో 3-4 తేడాతో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన తర్వాత టీమిండియాకి ఇది వరుసగా రెండో విజయం... 

ఈ మ్యాచ్‌లో టీమిండియా తరుపున మూడు గోల్స్ చేసిన వందన కటారియా, ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేసిన మొట్టమొదటి భారత మహిళా హాకీ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చెందాడు... ఒలింపిక్ మెడల్ తెస్తుందని ఆశపడిన పూజారాణి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయింది.
undefined
బాక్సింగ్ 69 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన లీ కియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-5 తేడాతో ఓడింది పూజా రాణి.
undefined

డిస్క్ త్రో ఈవెంట్‌లో గ్రూప్ బీలో కమల్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన ఇచ్చి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. తొలి ప్రయత్నంలో 60.29, రెండో ప్రయత్నంలో 63.97, మూడో ప్రయత్నంలో 64.00 విసిరి ఆటోమెటిక్‌ క్వాలిఫికేషన్ సాధించింది. 

Seema Punia

గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్, ఫైనల్స్‌కి దూసుకెళ్లగా... సీమా పూనియా క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే తప్పుకుంది.

Atanu Das

మెన్స్ సింగిల్స్ ఆర్చరీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు.

ఈక్వెస్ట్రైన్ ఈవెంట్‌లో భారత అథ్లెట్లు ఫవద్ మీర్జా 28.00 స్కోరు చేసి 9వ స్థానంలో నిలిచాడు. వ్యక్తిగత క్రాస్ కంట్రీ ఈవెంట్‌లో రేపు మరోసారి బరిలో దిగనున్నాడు ఫవద్ మీర్జా...

click me!