16 ఏళ్ల క్రికెట్ కెరీర్.. 80 సెంచరీలు, 26 వేల పరుగులు.. అయినా ఆగ‌ని ర‌న్ మిషన్ విరాట్ కోహ్లీ

First Published Aug 18, 2024, 6:15 PM IST

Virat Kohli : భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. స‌రిగ్గా ఇదే రోజు అంటే ఆగస్ట్ 18, 2008న విరాట్ అంత‌ర్జాతీ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. 
 

Virat Kohli : భారత మాజీ కెప్టెన్, ర‌న్ మిషన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్‌ను ఆగస్టు 18, 2008న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ప్రారంభించాడు. విరాట్ అరంగేట్రం మ్యాచ్ పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయాడు. కేవ‌లం 12 పరుగులకే ఔటయ్యాడు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్ర‌పంచ క్రికెట్ ను శాసించే స్థాయికి చేరుకున్నారు. 

క్రికెట్ ప్రపంచంలో 'కింగ్ కోహ్లి', 'ది రన్ మెషిన్'గా పేరొందిన విరాట్ క్రికెట్ గోల్డ్ బుక్‌లో అనేక రికార్డుల‌తో తన పేరు లిఖించాడు. అయితే, ఫామ్ లో లేనప్పుడు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ, కోహ్లీ నిబద్ధత, క్రికెట్ పట్ల మక్కువ, కృషి అతన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. అనేక అడ్డంకుల‌ను అధిగ‌మించి కొత్త రికార్డులు సృష్టించాడు. 

Latest Videos


Virat Kohli

విరాట్ కోహ్లీ తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత కోహ్లికి భారత  జ‌ట్టు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. తన కెరీర్‌లో 2011 వ‌న్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భార‌త జ‌ట్టులో కోహ్లీ భాగంగా ఉన్నాడు. 

లెజెండ‌రీ ప్లేయ‌ర్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ (100) త‌ర్వాత క్రికెట్ ప్ర‌పంచంలో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్ గా విరాట్ కోహ్లీ (80) కొన‌సాగుతున్నాడు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచ‌రీల రికార్డును  అధిగ‌మించాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సెంచ‌రీ రికార్డును న‌మోదుచేశాడు. 

విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఆరేళ్ల పాటు టెస్టుల్లో నంబర్ వన్‌గా కొనసాగింది. ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్. కెప్టెన్‌గా కోహ్లి ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు. వాలీ హమ్మండ్, మహేల జయవర్ధనేల రికార్డుల‌ను సమం చేశాడు.

2008లో వన్డేల్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 2011లో టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 113 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు.

click me!